
లక్నో: 2019 సార్వత్రిక ఎన్నికల్లో పసుపు రంగు చీరలో పోలింగ్ బూత్‌కు వచ్చి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన రీనా ద్వివేది గుర్తుందా? తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ఆఫీసర్‌గా ఉన్న రీనా ఈ సారి టాప్‌లో విధులకు హాజరయ్యారు. ప్రస్తుతం రీనా ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడత జరుగుతున్న సందర్భంగా పోలింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ బూత్‌కు విధుల నిమిత్తం వచ్చారు. ఈ క్రమంలో కొందరు ఆమెతో సెల్ఫీలు కూడా దిగారు. తన తోటి ఉద్యోగులు ఆమె ఫోలోయింగ్ చూసి ఆశ్చర్యపోయారు.
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు రంగు చీర ధరించి విధులకు హాజరైన రీనా తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరిని ఆకట్టుకున్నారు.ఆ సమయంలో ఆమె ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికారు. దీంతో ఆమె రాత్రికి రాత్రే సోషల్‌మీడియా స్టార్ అయ్యారు.
ప్రస్తుతం రీనా ద్వివేదికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. లఖ్‌నవూలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా రీనా పని చేస్తోంది.