న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల తేదీలు సమీపిస్తోన్న తరుణంలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్నీ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో విమర్శలు ప్రతి విమర్శల దాడితో దూసుకుపోతున్నాయి. తాజాగా ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాలలో వెయ్యి మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి ఈసీ అనుమతించింది. ఇంటింటి ప్రచారంలో జనాల పరిమితిని పెంచింది.
ఇంతకుముందు ఇంటింటి ప్రచారంలో 10 మందికే అనుమతి ఉండగా.. తాజాగా ఆ సంఖ్యను 20కి పెంచింది. ఇండోర్‌లో 500మంది వ్యక్తులతో ఎన్నికల సభ నిర్వహించేందుకు అనుమతించింది. అయితే ర్యాలీలు, రోడ్‌షోలపై ఉన్న నిషేధాన్ని ఫిబ్రవరి 11 పొడిగించింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీన తొలి విడత పోలింగ్ ఆరంభమై.. 4, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్‌ను నిర్వహించనుంది. అదే విధంగా మార్చిన 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
చదవండి: అయిదు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట!
Comments
Please login to add a commentAdd a comment