న్యూఢిల్లీ: 11 నెలల రైతుల నిరసన కేంద్రమైన పశ్చిమ ప్రాంతంలోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఓటర్లను ఉద్దేశించి ఒక వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆదిత్యానాథ్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ....ఓటర్లను ఓటు వేసేముందు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మీకు నేను ఒక విషయం చెప్పాలి. ఈ ఐదేళ్లో చాలా అద్భుతాలు జరిగాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ ఐదేళ్ల శ్రమ వృద్ధా అయిపోతుంది.
అంతేకాదు ఉత్తరప్రదేశ్ కాశ్మీర్, కేరళ లేదా బెంగాల్‌గా మారిపోతుందన్నారు. అంతేకాదు ఈ ఐదేళ్ల శ్రమకు మీ ఓటు తనకు దీవెన మాత్రమే కాక మీ నిర్భయ జీవితానికి భరోసాగా ఉంటుందని చెప్పారు. ఈ రోజు మీరు అతిపెద్ద నిర్ణయం తీసుకునే సయం ఆసన్నమైందన్నారు. బీజేపీ ప్రభుత్వం అంకితభావం, నిబద్ధతో పనిచేసిన విధానాన్ని మీరు కళ్లరా చూశారని అన్నారు. ఈ మేరకు యోగిఆదిత్యానాథ్ యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చే నిమిత్తం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు యూపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్న సంగతి తెలిసిందే.
मतदान करें, अवश्य करें !
— BJP Uttar Pradesh (@BJP4UP) February 9, 2022
आपका एक वोट उत्तर प्रदेश का भविष्य तय करेगा। नहीं तो उत्तर प्रदेश को कश्मीर, केरल और बंगाल बनते देर नहीं लगेगी: मुख्यमंत्री श्री @myogiadityanath pic.twitter.com/03VUlXOY35
(చదవండి: మోదీజీ మీ విధానాన్ని మార్చుకోండి!....అప్పుల బాధలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యాపారి!)
Comments
Please login to add a commentAdd a comment