న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నాయి. బీజేపీ తరపున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం సాగిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున అఖిలేశ్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా భుజానికెత్తుకున్నారు.
తమ పార్టీ ప్రధాన ప్రచారకర్తల(స్టార్ క్యాంపెయినర్లు) జాబితాను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్‌లతో పాటు ఇటీవల పార్టీలో చేరిన విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌లతో పాటు 30 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. (చదవండి: సమాజ్‌వాదీ పార్టీలో చేరిన బీజేపీ అభ్యర్థి)
Comments
Please login to add a commentAdd a comment