బీజేపీని ఆపే సత్తా లేదు: ఒవైసీ | Asaduddin Owaisi Says Akhilesh Yadav Doesnt Have Strength To Stop BJP In UP | Sakshi
Sakshi News home page

up assembly election 2022: బీజేపీని ఆపే సత్తా లేదు, అఖిలేశ్‌కు అంత సీన్‌ లేదు: ఒవైసీ

Published Wed, Mar 2 2022 9:38 AM | Last Updated on Wed, Mar 2 2022 11:54 AM

Asaduddin Owaisi Says Akhilesh Yadav Doesnt Have Strength To Stop BJP In UP - Sakshi

బలియా: బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపే సత్తా సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు లేదని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌తో జతకట్టారని, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఎస్‌పీతో పొత్తుపెట్టుకున్నారని గుర్తు చేశారు.

అయినా రెండు మార్లు బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. మైనార్టీలు తమ కూటమి (బీఎస్‌ఎం)కి మద్దతు ఇవ్వాలని, ఎస్‌పీ, బీఎస్‌పీ మధ్య ఫుట్‌బాల్‌లాగా మారవద్దని కోరారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించడం తమ కూటమి వల్ల మాత్రమే సాధ్యమన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement