
అమేథీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అమేథీ బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్‌పై ఆయన మొదటి భార్య, ఆ పార్టికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గరిమా సింగ్ బుధవారం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు! ఏమనో తెలుసా? ఎన్నికల అఫిడవిట్లో భార్యగా తన పేరు రాయలేదని! రెండో భార్య అమితా సింగ్ పేరు రాశారని! దీనిపై ఆర్వోకు రాతపూర్వకంగా అభ్యంతరం వెలిబుచ్చినట్టు చెప్పారామె.
తన హక్కు కోసం పోరాడేందుకే భర్తపై ఫిర్యాదు చేశానన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారా అని అడగ్గా, ‘‘ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటా’’ అని చెప్పారు. సంజయ్‌సింగ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. అమేథీ టికెట్ కోసం ఆయన భార్యలిద్దరూ పోటీ పడగా వారిని కాదని సంజయ్‌కి పార్టీ అవకాశమిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment