ఫైల్‌ఫోటో
తొలిసారిగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ బలమైన స్థానం నుంచే పోటీ చేయనున్నారు. ఈ మేరకు అఖిలేశ్ యాదవ్ వచ్చే నెలలో ఎన్నికలలో మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పార్టీ వర్గాల అందించిన ఈ సమాచారాన్ని అతని మామ రాజ్యసభ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఈ రోజు అధికారికంగా ధృవీకరించారు.
అంతేకాదు ఆయన మేనల్లుడు మెజార్టీ ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే 1993 నుంచి కర్హాల్ వాసులు ప్రతి ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. కానీ బీజేపి 2002 ఎన్నికలలో ఆ స్థానాన్ని గెలిచినప్పటికీ, 2007లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీ కర్హాల్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది.
ప్రస్తుతం కర్హాల్ సోబరన్ యాదవ్ ఆధ్వర్యంలో ఉంది. అంతేకాదు అఖిలేశ్ తండ్రి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఐదు అసెంబ్లీ స్థానాల్లో మైన్‌పురి లోక్‌సభ సీటు ఒకటి కావడం విశేషం. పైగా యూదవ్ స్వగ్రామమైన సైఫాయ్‌కి 5 కి.మీ దూరంలోనే కర్హాల్ ఉంది. అధికార పార్టీని గద్దె దింపేందకు ప్రాంతీయ పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్న అఖిలేశ్ యాదవ్ తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్నారు. అయితే ఆయన గతేడాది నవంబర్ నెలలో అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనని చెప్పారు. కాగా, బీజేపీ యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ నుంచి పోటీకి దిగనుండటంతో అఖిలేశ్ యాదవ్ సైతం ఒత్తిడిని అధిగమించేందుకు పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
అయితే అఖిలేశ్ ప్రస్తుతం యూపీలోని అజంగఢ్ నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్నా సంగతి తెలిసిందే. కాగా, అఖిలేశ్ యాదవ్ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2012లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఎంఎల్‌సీ హోదాలోనే ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అలాగే ఆదిత్యనాథ్ కూడా బలమైన స్థానం నుంచే పోటీచేస్తున్నారు. గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన యోగి.. ఆ నియోజకవర్గంలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు.
(చదవండి: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక!)
కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక క్లారిటీ.. ‘అసలేం జరిగిందంటే’
Comments
Please login to add a commentAdd a comment