
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థి ఉదయం పూట తినే పూరీ నుంచి ప్రచారానికి వినియోగించే లగ్జరీ కార్ల వరకు ఒక్కొక్క వస్తువుకి ఒక్కో ధరను ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ప్రచార ఖర్చు విషయంలో ఒక అభ్యర్థి ప్రచారంలో ఖర్చు వినియోగించుకునే సేవలు, వస్తువుల ధరలకు గరిష్ట పరిమితి ఎంతో తెలిపే చార్ట్‌ను లక్నో జిల్లా ఎన్నికల అధికారి తాజాగా ఖరారు చేసి విడుదల చేశారు.
చదవండి: బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్
ఇందులో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చు పరిమితిని రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. దీని ప్రకారం ఒక్కో అభ్యర్థి గరష్టంగా దేనిపై ఎంత ఖర్చు చేయాలనే దానిపై సమీక్ష నిర్వహించి ఈ జాబితాను ప్రకటించారు.
చదవండి: ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్: సూరీ.. ప్రమాణానికి సిద్ధమా ?
Comments
Please login to add a commentAdd a comment