న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలతో పొత్తు ఖరారు చేసుకుంది. అప్నాదళ్, నిషాద్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. ఈ రెండు పార్టీలకు వెనుబడిన వర్గాల నుంచి మద్దతు ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలసికట్టుగా పోరాటం చేస్తాయని నడ్డా విలేకరుల సమావేశంలో చెప్పారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతి భద్రతలు, పెట్టుబడులు, సామాజిక అభ్యున్నతిలో మంచి పనితీరుని కనబరుస్తోందని చెప్పారు. త్వరలోనే సీట్లసర్దుబాటు పూర్తవుతుం దని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న అప్నాదళ్ చీఫ్ అనుప్రియ పటేల్, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్‌లు మోదీ ప్రభుత్వం ఒబిసిల ప్ర యోజనాల కోసం పని చేస్తుందని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment