Breadcrumb
Live Updates
మణిపూర్ ఎన్నికలు: ముగిసిన పోలింగ్.. సాయంత్రం 5 గంటల నాటికి 78.03% ఓటింగ్
సాయంత్రం 5 గంటల నాటికి 78.03% ఓటింగ్..
మణిపూర్‌లో సాయంత్రం 5 గంటల నాటికి 78.03% ఓటింగ్ నమోదైంది
కాంగ్పోక్పి జిల్లాలో అత్యధికంగా 82.9%
బిష్ణుపూర్‌లో అత్యల్పంగా 73.44%
ఇంఫాల్ తూర్పు 76.64%
ఇంఫాల్ వెస్ట్ 82.19%
బిష్ణుపూర్ 73.44%
చురచంద్‌పూర్ 74.45%
కాంగ్పోక్పి 82.19%
మధ్యాహ్నం 3 గంటల వరకు 67.22% ఓటింగ్
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో మధ్యాహ్నం 3 గంటల వరకు 67.22% ఓటింగ్ నమోదైంది.
మణిపూర్ ఎన్నికల సిబ్బంది అనుమానాస్పద మృతి
ప్రధాన ఎన్నికల కార్యాలయం (సీఈఓ) రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. సోమవారం మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో ఉన్న మణిపూర్ పోలీసు సిబ్బంది తన సర్వీస్ రైఫిల్ వల్ల ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల్లో అనుమానాస్పదంగా రీతిలో మృతి చెందినట్లు తెలిపారు.
ఈ ఘటన చురచంద్‌పూర్ జిల్లాలోని తిపైముఖ్ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోలీసు సిబ్బందిని కక్చింగ్ జిల్లాకు చెందిన నౌరెమ్ ఇబోచౌబాగా గుర్తించారు.
మణిపూర్ ఎన్నికలు: దొంగ ఓట్ల ఆరోపణలు వచ్చిన వివిధ నియోజకవర్గాలు
* ఉల్లోక్ నంబోల్
* కాబో లీకై వాంగ్ఖీ
* హేంగ్లింగ్
* చురచంద్‌పూర్
మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ నియోజకవర్గం హీంగాంగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
సీఎం ఎన్ బీరెన్ సింగ్ నియోజకవర్గం హీంగాంగ్లోని ఓటింగ్ కేంద్రం తన ఏజెంట్లను పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అనుమతించకపోవడంపై స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల అధికారికి వ్రాతపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత వాతావారణం చోటు చేసుకుంది.
ఓటర్లు నిరసన
వాంగ్ఖీ నియోజకవర్గంలోని కబో లైకై కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఓటర్లు నిరసన తెలిపారు
కాంగ్పోక్పీ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఈవీఎం ధ్వంసం
మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లా సైకుల్ నియోజకవర్గంలోని లెప్లెన్ గ్రామంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓటింగ్ క్రేంద్రంలోని ఈవీఎంలు దెబ్బతిన్నాయి.
మధ్యాహ్నానికి కల్లా మణిపూర్ ఓటింగ్ ఎంతంటే..
మణిపూర్ అసెంబ్లీ 2022 ఎన్నికలు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.88 % ఓటింగ్ నమోదు.
మందకొడిగా మణిపూర్ పోలింగ్ ఓటింగ్
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫేస్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 27.34 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.
మణిపూర్: ఉదయం 9.30 గంటల వరకు 8.94 శాతం పోలింగ్
మణిపూర్‌లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు 8.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికలు అధికారులు పేర్కొన్నారు. ఓట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు.
మణిపూర్: ఓటేసిన డిప్యూటీ సీఎం
మణిపూర్ డిప్యూటీ సీఎం, ఎన్పీపీ అభ్యర్థి యుమ్నం జోయ్‌కుమార్ సింగ్ ఇంఫాల్‌లోని నౌరెమ్థాంగ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో తన ఓటు హక్క వినియోగించుకున్నారు.
మణిపూర్: ఓటు వేసిన గవర్నర్
మణిపూర్ రాష్ట్ర గవర్నర్ లా గణేశన్ ఇంఫాల్‌లోని తంఫాసనా బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, దానికి సంకేతమే ఈ ఎన్నికలని గుర్తుచేశారు.మణిపూర్ ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగి వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది.ఓటర్లు ఓటు వేయడానికి క్యూలైన్లలో నిల్చున్నారు.
మణిపూర్: కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ
2017లో జరిగిన ఎన్నికల్లో 60 సీట్లకుగాను బీజేపీ 21 చోట్ల నెగ్గింది. ఎన్పీపీ, ఎన్పీఎఫ్, తృణమూల్ కాంగ్రెస్, ఒక స్వతంత్య్ర అభ్యర్థి మద్దతుతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈసారి సుస్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరుతోంది.
మణిపూర్: సీఎం పోటీ చేస్తున్న స్థానానికి పోలింగ్
సీఎం బీరెన్ సింగ్ పోటీ చేస్తున్న స్థానంలో సోమవారం పోలింగ్ జరుగుతోంది. దాదాపు రెండు నెలలు బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా ప్రచారం చేసిన విషయం విదితమే.
మణిపూర్: ప్రారంభమైన తొలి దశ పోలింగ్
ఇంఫాల్: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు 38 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలి దఫాలో 15 మంది మహిళలుసహా 173 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం–1958 తొలగింపు డిమాండ్, రాష్ట్ర అభివృద్ధి, మహిళా సాధికారత, నిరుద్యోగం, అవినీతి అంశాలు ఓటింగ్‌పై సరళిపై ప్రభావం చూపనున్నాయి.
Related News By Category
Related News By Tags
-
ప్రమాణం చేయకుండానే సర్పంచ్ మృతి
న్యాల్కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్ (ఎన్) గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ బుధవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల నిర్వహించిన మూడో విడత పంచాయతీ ఎన్నికల...
-
మళ్లీ.. అధికారం మాదే: సీఎం రేవంత్
వచ్చే ఏడాది మార్చిలో రూ.3 వేల కోట్లు పంచాయతీలకు ఇస్తాం. నూతన సంవత్సరం కానుకగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఇస్తాం. చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు,పెద్ద గ్రామ పంచాయతీలకు రూ....
-
నేను ఏ పార్టీలో ఉంటే వారిదే విజయం: దానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న వేళ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు ...
-
శివాజీ చిల్లర వ్యాఖ్యలపై తెలంగాణా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫైర్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు శివాజీ నటుడు హీరోయిన్ల దుస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వేదికపై శివాజీ మహిళలను...
-
పీఎం అభ్యర్థిగా ప్రియాంక..?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై చర్చ జరుగుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికలలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చుపకపోవడంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సూచిస్త...


