ఆర్మూర్/నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు నేడు జరుగనున్నాయి. ఆర్మూర్ డివిజన్‌లోని 141 పంచాయతీలు, 1,004 వార్డులలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. సర్పంచ్, వార్డు ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి..
ఆర్మూర్ డివిజన్‌లో 11 మండలాల్లో గల 177 గ్రామ పంచాయతీలు, 1,546 వార్డులకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. అయితే, 36 పంచాయతీలు, 736 వార్డు లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 141 గ్రామాల కు, 1,004 వార్డులలో నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. 545 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,517 మంది వార్డు స్థానాల్లో పోటీలో ఉన్నారు. మొత్తం 3,11,148 మంది ఓటర్లు నేడు తమ ఓటు వేయనున్నారు. 1,452 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,957 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు పూర్తి స్థా యి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆయా మండల కేం ద్రాల నుంచి బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సు లు, ఇతర సామగ్రిని శనివారం పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల ను కలెక్టర్ రామ్మోహన్‌రావు, జిల్లా పరిశీలకు రాలు క్రిస్టినా జెడ్ చొంగ్తూ పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్, సిబ్బంది ఏర్పాట్లపై అధికారు లకు వివరించారు. మరోవైపు ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1,405 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
భారీగా ప్రలోభాలు..
పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు గెలుపు కోసం చివరి వరకూ సర్వశక్తులు ఒడ్డారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థుల ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు ఓటర్ల ను ప్రలోభపరుచుకునేందుకు ఆదివారం తెర లేపారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం, మాంసం పంపిణీ చేశారు. కొన్ని గ్రామాల్లో ఆదివారం ఒక్క రోజే లెక్కకు మించి ఖర్చు అయింది. చికెన్, మద్యంతో పాటు డబ్బులు పంపిణీ చేశా రు. దీంతో చాలా చోట్ల చికెన్‌తో పాటు కూల్‌డ్రింక్స్‌కు కొరత ఏర్పడింది. కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు పంపి ణీ చేసినట్లు సమాచారం. మేజర్ పంచాయతీల్లో ఒక్కో అభ్యర్థి సుమారుగా రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. కమ్మర్‌పల్లి, మోర్తాడ్, భీమ్‌గల్ తదితర మండలాల్లో ఓటర్లకు భారీగా ముట్టజెప్పినట్లు సమాచారం. ఇక, ఓటర్లను పోలింగ్ కేంద్రాలను తరలించడానికి అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. వాహనాల్లో ఓటర్లను తరలించి ఎక్కువ ఓట్లు పొందాలనే ఉద్దేశ్యంతో ఆటోలు, జీపులు, కార్లు సిద్ధం చేసి ఉంచారు.
తొలిపోరు నేడే
Published Mon, Jan 21 2019 11:07 AM | Last Updated on Mon, Jan 21 2019 11:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment