సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ : రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌సహా మాజీ కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు, పలువురు సినీనటులను రంగంలోకి దించి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం ముమ్మరం చేయనుంది. ఇందుకు సంబంధించి సోమవారం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనన్న క్యాంపెయినర్ల జాబితాను సోమవారం పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే...
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, వి.నారాయణస్వామి, అశోక్ చవాన్, జి. పరమేశ్వర, మీరా కుమార్, డీకే శివకుమార్, మహ్మద్ అజారుద్దీన్, విజయ శాంతి, సల్మాన్ ఖుర్షీద్, జ్యోతిరాదిత్య సింధియా, జైపాల్ రెడ్డి, ఆర్‌సీ కుంతియా, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మద్, బీఎస్ బోసురాజు, మర్రి శశిధర్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాములు నాయక్, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పి.సుధాకర్‌రెడ్డి, రేణుకా చౌదరి, డీకే అరుణ, వి.హన్మంతరావు, రాజ్‌బబ్బర్, నదీం జావేద్, నగ్మా, ఖుష్బూ, నేరెళ్ల శారద, జైరాంరమేశ్, అనిల్ థామస్, నితిన్ రౌత్.
టీడీపీ స్టార్ క్యాంపెయినర్లు 19మంది
ఇక 19మందితో టీడీపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఇందులో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టి.దేవేందర్‌గౌడ్, రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు సండ్ర వెంకట వీరయ్య, పెద్దిరెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, మండల వెంకటేశ్వర్‌రావు, లక్ష్మణ్ నాయక్, ఎండీ యూసుఫ్, గుల్లపల్లి బుచ్చిలింగం, ఈగ మల్లేశం, నన్నూరి నర్సిరెడ్డి, నల్లూరి దుర్గా ప్రసాద్, పి.సాయిబాబా, టి.వీరేందర్ గౌడ్, బొట్ల శ్రీనివాస్, ఎండీ తాజొద్దీన్, వల్లభనేని అనిల్ పేర్లున్నాయి. అయితే ఈ జాబితాలో ఎక్కడా టీడీపీ అధినేత చంద్రబాబు, సినీ హీరో బాలకృష్ణల పేర్లు లేవు. రాష్ట్రంలో టీడీపీ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో బాబు సైతం ప్రచారం చేస్తారని చెబుతున్నా ఆయన పేరును ఎక్కడా పేర్కొనలేదు. ఇక దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రచారం చేస్తానని బాలకృష్ణ ఇదివరకే ప్రకటించినా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు కూడా లేదు.
Comments
Please login to add a commentAdd a comment