సాక్షి, మహబూబ్‌నగర్ రూరల్: మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండలంలోని కోడూర్, అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి, ఓబ్లాయిపల్లి తండాల్లో మాజీ మంత్రి చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేష్, డీసీసీ ఉపాధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌తో కలిసి మహబూబ్‌నగర్ అసెంబ్లీ మహాకూటమి అభ్యర్థి ఎర్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జె.చంద్రశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు గోవింద్‌యాదవ్, సీపీఐ నాయకుడు రామకృష్ణ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరాములు, ఆంజనేయులు, చెన్నయ్య, వెంకట్రాములు, ఊషన్న, రమేష్‌శెట్టి, నర్సిములు, కుర్మయ్య, ఆనంద్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
హన్వాడలో..
హన్వాడ: మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు మద్దతుగా కాంగ్రెస్ మండల నాయకులు తిరుమలగిరి, పుల్పొనిపల్లి, ఇబ్రహీంబాద్‌లో ప్రచారం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అదేవిధంగా కొనగట్టుపల్లి, బుద్దారంలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఎర్రశేఖర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు సత్యం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు శబ్బీర్, నాయకులు కృష్ణయ్య, రామయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకన్న, శ్రీను, ఖాసీం, ఎంపీటీసీ శ్రీనునాయక్, బాలగోపి, కలీం పాల్గొన్నారు.
టీడీపీలో చేరిన కార్యకర్తలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: టీడీపీలో శుక్రవారం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. మహాకూటమి అభ్యర్థి ఎర్రశేఖర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న తిరుపతయ్య దాదాపు 100మంది కార్యకర్తలతో టీడీపీలో చేరారు. వీరితో పాటు మహబూబ్‌నగర్ మండలంలో దాదాపు 150మంది ఆర్‌ఎంపీలు ఎర్రశేఖర్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఎర్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ మూలాలు గట్టిగా ఉన్నాయని, ప్రభుత్వాలు మారిన కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం తగ్గలేదన్నారు. మహాకూటమి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కురుమ యాదవుల మద్దతు
పాలమూరు: రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు మద్దతు తెలపాలని కురుమయాదవ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సత్యంయాదవ్ తీర్మానం చేశారు. మండలంలోని పత్తేపూర్‌లో శుక్రవా రం నాయకుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యద ర్శి వెంకటేష్, చెన్నయ్య, లక్ష్మయ్య, సాయిబాబా, కేశవులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment