
సమావేశంలో మాట్లాడుతున్న రాజ్‌కుమార్ పాటిల్
సాక్షి, నారాయణపేట రూరల్ : తెలంగాణ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించడంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ ప్రచారానికి రావడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల్లో ఓటమి భయం పట్టుకుందని కర్ణాటక రాష్ట్రం సేడెం బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్ అన్నారు. నారాయణపేటలో బుధవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు.
దేశ రాజకీయాల్లోకి మోదీ వచ్చిన తర్వా త కాంగ్రెస్‌కు ఎక్కడాడ స్థానం లేకుండా పోతోందన్నారు. ఈక్రమంలో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించడంతో ఇక్కడ తమ ఉనికి కోల్పో తామని వారికి భయం చుట్టుకుందని అన్నారు. ఉద్యమ సానుభూతితో అధికారం చేపట్టిన కేసీఆర్ సైతం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయకుండా కనీసం మేనిఫెస్టోను అమలు చేయకుండా ముందస్తుకు పోవడం గర్హనీయమన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉజ్వల యోజన, జనప్రియ యోజన, జాతీయ రహదారుల ఏర్పాటు, ఇండ్లు, ముద్రా బ్యాంక్‌తో పాటు ఆయుష్మాన్ భారత్‌తో దేశ వ్యాప్తంగా 50కోట్ల మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కాగా, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కానుందని.. తమ పార్టీ అభ్యర్థులు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీట్లలో నారాయణపేట ఒకటని, రతంగపాండురెడ్డికి తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని రాజ్‌కుమార్ పాటిల్ తెలిపారు.
ప్రచారానికి ప్రముఖులు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30న దామరగిద్దకు పరిపూర్ణానందస్వామి రానున్నారని రాజ్‌కుమార్ తెలిపారు. డిసెంబర్ 2న నారాయణపేటకు అమిత్‌షా వస్తున్నారన్నారు. యాద్గీర్ జెడ్పీ మాజీ చైర్మన్ శరణ్‌భూపాల్‌రెడ్డి, రతంగపాండు రెడ్డి, ప్రభాకరవర్ధన్, బోయలక్ష్మణ్, రఘువీర్‌యాదవ్, రఘురామయ్యగౌడ్, వినోద్ పాల్గొన్నారు.