ఆశీర్వదించండి.. సేవకుడిలా పనిచేస్తా.. | Bless .. work as a servant | Sakshi
Sakshi News home page

ఆశీర్వదించండి.. సేవకుడిలా పనిచేస్తా..

Published Fri, Nov 23 2018 8:55 AM | Last Updated on Wed, Mar 6 2019 6:04 PM

Bless .. work as a servant - Sakshi

పార్టీలో చేరిన వారితో ప్రజాకూటమి నాయకులు   

సాక్షి, పాన్‌గల్‌: కొల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థిని ఒక్కసారి ఆశీర్వదించండి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకుడిగా పనిచేస్తానని కొల్లాపూర్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గోప్లాపూర్, కిష్టాపూర్‌తండా, మాధరావుపల్లి, కదిరెపాడు, శాగాపూర్‌తండా, చిక్కేపల్లి, కేతేపల్లి గ్రామాల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసులు, సీపీఐ జిల్లా నాయకులు కళావతమ్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కాంగ్రెస్‌ పార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టోను రూ పొందించిందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓటు ద్వారా తగిన గుణపా ఠం చెప్పాలన్నారు. గోప్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు సిద్ధయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో నాయకులు రామ్మూర్తినాయుడు, రవికుమార్, వెంకటయ్యనాయుడు, శ్రీరాం, అశోక్‌రెడ్డి, రఘుపతినాయుడు, సాయికుమార్‌రెడ్డి, నర్సింహ, రాజారెడ్డి, హన్మంతురెడ్డి, రమేష్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

వీపనగండ్ల: గ్రామాల్లో మహిళలు, యువకులు, విద్యార్థులు టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలన్న దృఢసంకల్పంతో ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మహాకూటమి తరపున పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి గెలుపు కోసం గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, రుణమాఫీ పేరుతో రైతులను, డబుల్‌ బెడ్‌రూం పేరుతో నిరుపేదలను మోసం చేసిందన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావును ఓడించేందుకు అన్ని గ్రామాల్లో ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బీరయ్య, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, బాలచందర్, కృష్ణయ్య, వెంకట్‌రెడ్డి, బాలస్వామి, రాఘవేందర్‌రెడ్డి, సాయిబాబ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement