ఎన్నికల సిత్రాలు..! | Candidates are Promoting Various Methods | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిత్రాలు..!

Published Mon, Dec 3 2018 11:09 AM | Last Updated on Mon, Dec 3 2018 11:09 AM

 Candidates are Promoting Various Methods - Sakshi

తమ్ముడిది టెలిఫోన్‌ గుర్తు


హలో అన్నా! తమ్ముడిది టెలిఫోన్‌ గుర్తు మరువకుండా ఓటు వెయ్యి.. అంటూ ఏకంగా టెలిఫోన్‌ను పట్టుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు జడ్చర్చ స్వతంత్ర అ«భ్యర్థి మార్పడ రమేష్‌రెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి. గుండ్లపొట్లపల్లి గ్రామంలో ఆదివారం టెలిఫోన్‌తో ప్రచారం చేస్తున్న దృశ్యమే ఇది. 
– రాజాపూర్‌

తాంబులం ఇచ్చారు.. ఓటు కూడా వేయండి


తాంబులం ఇచ్చారు.. అదే రీతిలో ఓటు కూడా వేసి గెలిపించండి అంటూ దేవరకద్ర మహాకూటమి అభ్యర్థి డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి సతీమణి డోకూర్‌ రజిని కోరారు. దేవరకద్ర మండలం బల్సుపల్లిలో ఆదివారం ఆమె ఇంటింటి ప్రచారంలో పాల్గొనగా.. ఓ మహిళ తాంబులం ఇచ్చి గౌరవించారు. దీంతో ఓటు కూడా వేయాలని రజిని కోరారు. 
– దేవరకద్ర 


మీకు చేయూతనిస్తా...


పోలింగ్‌ సమీపిస్తుండడంతో కొల్లాపూర్‌లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు ఆదివారం సంత కావడంతో అభ్యర్థులు విస్తృతంగా పర్యటించి చిరువ్యాపారులు, ప్రజలను కలిసి తమనే గెలిపించాలని కోరారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి సతీమణి విజయ ఓ హోటల్‌లో ఇలా దోసెలు వేసి కొద్దిసేపు సాయం అందించారు. 
– కొల్లాపూర్‌ 


తలకెక్కిన అభిమానం


కొల్లాపూర్‌ బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావుకు మద్దతుగా నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ సభలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ముఖ్యఅతిథిగా మాట్లాడగా ప్రజలు, బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావుపై అభిమానంతో ఓ కార్యకర్త ‘ఏఎస్‌ఆర్‌’ అక్షరాల రూపంలో క్రాఫ్‌ చేయించుకుని రావడం ఆకట్టుకుంది. 
– కొల్లాపూర్‌ 

ఉండక్కా.. బొట్టు పెడ్తా!

అడ్డాకుల మండలం శాఖాపూర్‌లో దేవరకద్ర టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి మంజుల ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటికి వెళ్లగా అక్కడి మహిళ.. మంజులను ఆడపడుచుకుగా భావించి బొట్టు పెట్టి ఆప్యాయంగా మాట్లాడారు. 
– అడ్డాకుల   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement