మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కిషన్‌రెడ్డి
సాక్షి, సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): కాంగ్రెస్, తెలంగాణ ద్రోహుల పార్టీ అయిన టీడీ పీ పొత్తుతో ఏర్పడిన మహాకూటమి తెలంగాణ ప్రజల వ్యతిరేక కూటమి అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం నిజామాబాద్ అర్బన్ శివసేన అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా నామినేషన్ ఉపసంహరించుకున్న అనంతరం విలేకరులతో మా ట్లాడారు. పార్టీ ఆదేశాల మేరకు జాతీ య కార్యదర్శి కృష్ణదాస్, తాను జిల్లాకు వచ్చి ధన్‌పాల్‌తో సంప్రదింపులు జరిపామని, అవి ఫలించాయ న్నారు. ధన్‌పాల్‌కు పార్టీలో సముచితమైన స్థానాన్ని ఇస్తామని, ఆయన త్యాగాన్ని పార్టీ మర్చిపోదని, రాజీనామాలను తిరస్కరించామన్నారు.
పొత్తులు శోచనీయం..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్–మజ్లీస్, కాంగ్రెస్– టీడీపీలు పొ త్తులు శోచనీయమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం లో బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని, అర్బన్‌లో మజ్లిస్ పోటీలో లేదంటే టీఆర్‌ఎస్ మాయేనన్నారు. పార్టీ గౌరవాన్ని చూసే...: ధన్‌పాల్ బీజేపీ తనకిచ్చిన గౌరవాన్ని గుర్తించి నామినేషన్ ఉపసంహరించుకున్నానని ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. భవిష్యత్ బీజేపీదేనని, హిందువుల ఓట్లు చీలిపోవద్దనే ఉద్ధేశంతో పోటీ నుంచి తప్పుకున్నానన్నారు. పార్టీ జిల్లాఅధ్యక్షులు పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ, లోక భూపతిరెడ్డి, నాయకులు గజం ఎల్లప్ప, బాల్‌రాజ్, యెండల సుధాకర్, జాలిగం గోపాల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రనేతల బుజ్జగింపులు ఫలించాయి. నామినేషన్లకు చివరిరోజైన మంగళవారం పార్టీ ఆదేశాల మేరకు జాతీయ నాయకులు కృష్ణ దాస్, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షు లు కిషన్‌రెడ్డి ధన్‌పాల్‌తో రహస్య ప్రదేశంలో నాలుగ్గంటలకు పైగా భేటీ అయి చివరకు ఆయనను ఒప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment