
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో మహాకూటమి నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. మరో మూడు రోజుల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో చంద్రబాబు నివాసం వద్ద కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టివిక్రమార్క, కర్టాటక మంత్రి డీకే శివకుమార్, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌లు హాజరయ్యారు. ప్రచార అనంతరం ఉన్న రెండు రోజుల్లో అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పోల్‌మేనేజ్‌మెంట్‌పై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండగా.. కూటమిలో భాగస్వామి అయిన టీజేఎస్ కీలక నేత రచనా రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేయడంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇక కర్ణాటక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మహాకూటమి ఒప్పందం ప్రకారం చంద్రబాబు ఇస్తానన్న.. డబ్బులపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తమతో జతకట్టినందుకు చంద్రబాబు రూ. 500 కోట్లు ఇస్తానని ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment