
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి స్ఫూర్తిని దెబ్బతీయకుండా పోటీ అభ్యర్థులను తక్షణమే భాగస్వామ్యపక్షాలు అన్ని చోట్ల ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కోరారు. ఇప్పటికే నడుస్తున్న కాలయాపనపై కూటమి పార్టీల శ్రేణులు ఆందోళన లో ఉన్నాయని, కాంగ్రెస్, టీజేఎస్‌లు వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు మంగళవారం ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు.