vijaya santhi
-
సీఎం కేసీఆర్ పై మండిపడ్డ విజయశాంతి.
-
ఈటలకు విజయశాంతి కౌంటర్.. అలా మాట్లాడితే సరిపోదు కదా?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో, తెలంగాణ బీజేపీ నేతలు ఈటల వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీలో ఇద్దరు జాతీయ కార్యవర్గ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ అటాక్ చేశారు. కోవర్టులను పేర్లతో సహా బయటపెట్టండి అంటూ కామెంట్స్ చేశారు. నిజంగా కోవర్టులు ఉంటే కేంద్రం కూడా వారిపై చర్యలు తీసుకుంటుంది. వారి గురించి నిజాలు బయటపెట్టండి. దీంతో, పార్టీకి మీరు మేలు చేసిన వారు అవుతారు అని ఈటలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఊరికే కోవర్టులు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దొంగతనం జరిగినప్పుడు దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. వారిని పోలీసులను అప్పగించాలి కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పరోక్షంగా ఈటలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది. మరోవైపు.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీలో కోవర్టులు ఉండరు. బీజేపీ సిద్దాంతం కలిగిన పార్టీ అంటూ కామెంట్స్ చేశారు. -
పోస్టులు భర్తీ చేయకుంటే మిలియన్ మార్చ్
సిరిసిల్ల: దీపావళి పండుగలోగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుంటే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని, నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో శనివారం ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామన్న కేసీఆర్, ఏడేళ్లలో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి తరువాత నిర్వహించే మిలియన్‌మార్చ్ ఉద్యమంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని, ఇదే చివరి ఉద్యమం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నిరుద్యోగికి రూ.లక్ష చొప్పున బాకీ ఉందన్నారు. కేసీఆర్ కేవలం ఒక్క రైతుబంధు ఇస్తూ.. అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తివేశారన్నారు. ఇక గల్ఫ్ బాధితులను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం నిధులు ఇస్తే.. వాడుకుంటూనే ఏం ఇవ్వడం లేదని కేసీఆర్ చెబుతున్నారని సంజయ్ ఆరోపించారు. కాగా, గ్రామాల్లో ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఎన్నో సమస్యలు తెలుస్తున్నాయని కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాలా అన్నారు. బండి సంజయ్ వెంట ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన అంకిరెడ్డిపల్లెలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. అన్నీ ఆయన కుటుంబానికే... తెలంగాణ వస్తే నీళ్లు.. నిధులు.. నియామకాలు వస్తాయని అందరూ భావించారని, కానీ ఏడేళ్లలో అన్నీ సీఎం కేసీఆర్ కుటుంబానికే వచ్చాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. అంకిరెడ్డిపల్లె బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ఉపాధి కల్పించకుండా కేసీఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను గద్దె దించి బీజేపీని గెలిపించాలని కోరారు. -
సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్
-
పోటీ అభ్యర్థులు తక్షణమే ఉపసంహరించుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి స్ఫూర్తిని దెబ్బతీయకుండా పోటీ అభ్యర్థులను తక్షణమే భాగస్వామ్యపక్షాలు అన్ని చోట్ల ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కోరారు. ఇప్పటికే నడుస్తున్న కాలయాపనపై కూటమి పార్టీల శ్రేణులు ఆందోళన లో ఉన్నాయని, కాంగ్రెస్, టీజేఎస్‌లు వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు మంగళవారం ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. -
మెదక్ పరిధిలో కూటమికి సీట్లు కేటాయించొద్దు
సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో మహాకూటమిలోని పార్టీలకు ఒక్క సీటు కేటాయించొద్దని కాంగ్రెస్ స్టార్ క్యాం పెయినర్ విజయశాంతి సూచించారు. ఒక వేళ కూటమి తరఫున అభ్యర్థులను నిలిపితే మాత్రం మెదక్ పార్లమెంట్ స్థానంపై ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు తప్ప కూటమి అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదని తెలిపారు. అం తేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి సైతం లేదని శుక్రవారం పేర్కొన్నారు. -
బాబుతో అప్రమత్తంగా ఉండాలి: కర్నె ప్రభాకర్
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభ తగ్గిందని సర్వేలు చెబుతున్నాయని.. అక్కడ ముఖ్యమంత్రి పదవి పోతుండటంతో తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తు న్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలం గాణ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన చంద్రబాబు విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. టీఆర్ఎస్ నేతల ఫోన్లను ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపైనో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందలేదని, చంద్రబాబు కట్టిన హైటెక్ సిటీ గబ్బిలాల మందిరంగా తయారైందని చెప్పారు. చంద్రబాబు మరోసారి తెలంగాణలో కుట్రలు చేసే ప్రమాదం ఉందనే టీడీపీతో పొత్తులు పెట్టుకోలేదు. రాష్ట్ర ఏర్పాటు కోసమే పొత్తు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని కర్నె తెలి పారు. టీఆర్ఎస్ బహిరంగసభలకు ప్రజలు భారీగా స్వచ్ఛందంగా తరలి రావడాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేయకుం డా కాంగ్రెస్ అడ్డుకోవడం నీతిమాలిన చర్యని, ఇది ఆడపడుచులను అవమానపరచడమేనని విమర్శించారు. మిషన్ భగీరథ పనులను ఆపా లని కేసు కూడా వేస్తారేమోనన్నారు. ఇలాంటి ప్రతిపక్షం భవిష్యత్తులో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు కీడు జరుగుతుందన్నారు. కేసీఆర్‌కు రాఖీ కట్టినప్పుడు గుర్తు లేదా? గుండు సుధారాణి సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టినప్పుడు విజ యశాంతికి దొర పదం గుర్తుకు రాలేదా అని టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి విమర్శించారు. ప్రభుత్వ పథకాలు విజయశాంతికి సంపాదన పథకాలుగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ చేనేత వర్గాలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం బతుకమ్మ చీరల పం పిణీ చేపట్టిందని, మహిళలు కట్టుకునే చీరలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. ‘తెలం గాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ. తరతరా ల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం చీరలను ఇస్తోం ది. మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్ నీచ సంస్కృతి. కేసీఆర్ అమలు చేసిన ప«థకాలను, ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
మరో విజయశాంతి!
‘దృశ్యం’ వంటి హిట్ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఘటన’. నిత్యామీనన్ లీడ్ రోల్లో, క్రిష్ జె.సత్తార్ హీరోగా మలయాళంలో రూపొందిన ‘22 ఫిమేల్ కొట్టాయమ్’ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ సమర్పణలో వి.ఆర్. కృష్ణ ‘ఘటన’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో చేశారు. ‘‘ఈ చిత్రంలో నిత్యామీనన్ నటన చూస్తే, ‘ప్రతిఘటన’ చిత్రంలో విజయశాంతిలా అనిపిస్తారు. రేపు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు. -
ఉద్యమం వేరు పాలన వేరు: విజయశాంతి
ఇంటర్వ్యూ: విజయశాంతి * టీఆర్ఎస్కు పరిపాలన చేతకాదు * టీడీపీ-బీజేపీ పొత్తుతో ఒరిగేదేమీలేదు * అమరవీరుల త్యాగాలను రాజకీయం చేయొద్దు ఎలక్షన్ సెల్: విజయశాంతి... సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ‘తెలంగాణ ఉద్యమం’లో భాగస్వామి అయ్యారు. మొదట్లో బీజేపీ, తరువాత టీఆర్ఎస్... ఇపుడు కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఉన్న ఆమె ఇపుడు కాంగ్రెస్ తరఫున మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేస్తున్నారు. ప్రచారంలో తలమునకలై ఉన్న ఆమె తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాగా వేస్తుందంటున్నారు. టీడీపీ-బీజేపీ పొత్తులతో తెలంగాణలో ఒరిగేదేమీ లేదు. బీజేపీ ఆహా ఓహో అం తా బాగుంది అంటూ ఊదరగొడుతోంది. కానీ ఆ పరిస్థితి లేనేలేదు. నేను ఆ పార్టీ లో నుంచే వచ్చాను కదా నాకు అంతా తెలుసు. ఆ పార్టీతో ఏమీ కా దు. మోడీ గాలి అంటున్నారు కానీ ఆ పరిస్థితి కిందిస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో లేనేలేదు. ఇక టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. ఆ పార్టీ నుంచి అనేక మంది వివిధ పార్టీల్లో చేరిపోయారు. దీంతో ఆ పార్టీకి ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు. తెలంగాణలో అధికారం ఇస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని తెలుగుదేశం పార్టీ చెబుతుతోంది. అది సరే తెలంగాణకు మద్దతు ఇస్తామ ని చెప్పి తర్వాత ఆ పార్టీ మాట మార్చుకోలేదా? బీసీ సీఎం హామీ కూడా అంతే. టీడీపీవన్నీ మాయమాటలు. టీఆర్ఎస్వి మాయమాటలు... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల్ల. ఉద్యమాలు వేరు పరిపాలన వేరు. టీఆర్ఎస్ పరిపాలన చేయలేదు. కరీంనగర్, మహబూబ్‌నగర్‌ల నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించి కేసీఆర్ ఏం చేశారు? ప్రజలకు ఏం పనులు చేశారు? వారికి అందుబాటులో ఉన్నారా? జాతీయ పార్టీగా కాంగ్రెస్సే మంచి పరిపాలన ఇవ్వగలదు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీనే తెలంగాణ ఇచ్చినప్పుడు దాన్ని గెలిపిం చాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలదే. తెలంగాణ ఇస్తే సోనియాను, కాంగ్రెస్‌ను నెత్తిమీద పెట్టుకుంటాం అంటూ కేసీఆర్ ఏమేమో చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విలీనం అన్నాడు... ఏం చేశాడు? టీఆర్ఎస్ మాయమాటలు చెబుతోంది. వారు చేసేది లేదు పెట్టేది లేదు. తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యం. అసలు టీఆర్ఎస్ వారికి అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. వారికి పదవులు కావాలంతే. వారికి పరిపాలన చేతకాదు. దళితులను సీఎం చేస్తానన్నారు. మరెందుకు వెనక్కు తగ్గారు? తెలంగాణ పునర్నిర్మాణం అంటే తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టుబడులు రావాలి. స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావాలి. ప్రాజెక్టులు రావాలి. ఒక్కటి అనేక అంశాలపై తెలంగాణ అభివృద్ధి కావాలి. తెలంగాణ ప్రాంతం మొత్తం సెట్‌రైట్ కావాలి. అందుకు విజన్ ఉండాలి. అలాంటి విజన్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. మెదక్ అభివృద్ధిపై దృష్టి... ఈసారి ఎంపీగా పోటీచేయదలచుకోలేదు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మెదక్‌ను అభివద్ధి చేయాల్సిన బాధ్యత నామీద ఉంది. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎంపీగా చాలా పనులు చేశాను. వెయ్యి గ్రామాలుంటే 700 గ్రామాల్లో తిరిగాను. తెలంగాణ ఉద్యమాలు చేస్తూ కూడా బాగా పనిచేశాను. పోలీస్స్టేషన్లు, గొడవలు, ఉద్యమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నాను. మెదక్ ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ అభివద్ధిపై దృష్టిపెట్టాలన్నదే నా ఉద్దేశం. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినవారెవరూ దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. 40 శాతం కూడా పనిచేయలేదు. టీఆర్ఎస్ నుంచి ఉన్నవారెవరు దీన్ని పట్టించుకోలేదు. నాకు గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టాను. ప్రజల నుంచి స్పందన బాగుంది. నన్ను గెలిపించుకుంటాం అని చెబుతున్నారు. పదవుల కోసం అమరవీరులు త్యాగాలు చేయలేదు... తెలంగాణ అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టిక్కెట్టు కూడా ఇవ్వలేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు అర్థంలేదు. అమరులైన వాళ్లు పదవులు ఆశించి త్యాగం చేయలేదు. టిక్కెట్ల కోసం చేయలేదు. తెలంగాణ భవిష్యత్తు బాగుం డాలన్న విశాల ధృక్పథంతో ఆత్మార్పణ చేసుకున్నారు. కొందరు దీన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారు. ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి. త్యాగాన్ని గుర్తించాలి. అంతేతప్ప త్యాగాలు చేసినవారు రాజకీయ పదవులు తమ కుటుంబాలకు కావాలని చేయలేదు. సీమాంధ్ర ప్రజలు ఇక ద్వేషాలకు పోకుండా అర్థంచేసుకోవాలి. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థంచేసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినందున అభివృద్ధిపై ఎవరికివారు కృషిచేయాలి. అక్కడ ఎవరికి ఓటేయాలో వారే సరైన నిర్ణయం తీసుకొని ఆలోచించుకోవాలి. -
కేసీఆర్ పై పోటీ చేయి రాములమ్మ... ప్లీజ్!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును మరింత ముమ్మరం చేసింది. మెదక్ లోక్‌సభ బరి నుంచి స్థానిక ఎంపీ విజయశాంతి (రాములమ్మ)ని ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే విజయశాంతితో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపింది. ఓ వేళ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అదే స్థానం నుంచి పోటీ చేస్తే విజయశాంతి అయితేనే సరైన అభ్యర్థి అని ఆ పార్టీ భావిస్తుంది. కేసీఆర్ చేతిలో ఓడిపోయిన పక్షంలో రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇప్పటికే రాములమ్మకు కాంగ్రెస్ అధిష్టానం భరోసా ఇచ్చిందంటా. 2009 ఎన్నికలలో మెదక్ లోక్‌సభకు టీఆర్ఎస్ అభ్యర్థిగా రాములమ్మ ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత విజయశాంతి కారు దిగి హస్తం గూటికి చేరిన విషయం విదితమే. అయితే సికింద్రబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే, సినీనటి జయసుధా అదే స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి వెల్లడించింది. దాంతో ఆమెను లోక్‌సభ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తుంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటికే కాంగ్రెస్ తరపున రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికైయ్యారు. ఆయన ముచ్చటగా మూడోసారి ఎంపీగా ఎన్నిక కావాలని తెగ ఆరాటపడుతున్నారు. ఆ తరుణంలో అంజన్న ఆశలకు జయసుధ గండికొట్టే పనిలో ఉన్నారు. అంజన్నను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు సమాచారం. -
రాములమ్మ ఎటువైపు?
కమలాన్ని వీడి కారు ఎక్కి ఆ తర్వాత హస్తాన్ని అందుకోవాలనుకున్న మెదక్ ఎంపీ విజయశాంతి పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. రాములమ్మ రాజకీయ జీవితం ప్రస్తుతం సుడిగుండంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. మెదక్ సీటు విషయంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో విభేదించి తెలంగాణ... కాంగ్రెస్ ఇచ్చింది అంటూ పార్టీ మార్చిన విజయశాంతి పాలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకమైంది. వెండి తెరపై ఒకప్పుడు లేడీ అమితాబ్‌గా ఓ వెలుగు వెలిగిన రాములమ్మకు రాజకీయాలు మాత్రం అంత కలిసి రావడం లేదు. విజయశాంతి ఇప్పుడు సమస్యల రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. కారుకు గుడ్ బై చెప్పి హస్తాన్ని అందుకోవాలనుకున్నా ఆమెకు అక్కడా సమస్యలు తప్పేట్లు లేవు. బీజేపీలో చేరిక మొదలు టీఆర్ఎస్ను వీడే వరకూ అడుగడుగునా ఆమె ఒడిదుడుకులనే ఎదుర్కొంది. బీజేపీని వీడి ఆ తర్వాత 'తల్లి తెలంగాణ' పార్టీని స్థాపించింది. కొద్దిరోజుల అనంతరం ఆర్థిక ఇబ్బందులతో తన పార్టీని కేసిఆర్ చేతిలో పెట్టి, ఆయనకు మెదక్ చెల్లెమ్మగా మారిపోయింది. అయితే, గులాబీ దళంలోనూ విజయశాంతి ఇమడలేకపోయింది. అంతకు ముందు అనేకసార్లు అలకబూని, పలుసార్లు పార్టీని వీడుతున్నట్లు వార్తలు వచ్చినా తూచ్ అంటూ... సర్దుకుంది. అయితే తాజాగా తెలంగాణ ప్రకటనతో విజయశాంతి గాలి కాంగ్రెస్ వైపు మళ్లింది. కానీ, మెదక్ సీటు వదిలేది లేదంటున్న రాములమ్మకు హస్తం నుంచి కూడా సరైన హామీ రాలేదని సమాచారం. దాంతో నిన్న మొన్నటి వరకూ అత్యుత్సాహంగా ప్రకటనలు గుప్పించిన రాములమ్మ ఉన్నట్టుండి మౌనముద్రలోకి వెళ్లిపోయింది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నేతలు పలుమార్లు హస్తినకు వెళ్లినా, సోనియాకు కృతజ్ఞతలు చెప్పేందుకు జైత్రయాత్ర సభలు నిర్వహించినా ఆ దరిదాపుల్లో కూడా విజయశాంతి జాడ లేదు. తెలంగాణ విషయంలో ఎవరేమన్నా వెంటనే ఖండించే ఆమె ఇప్పుడు మౌనమంత్రాన్నే పఠిస్తోంది. హైదరాబాద్ యూటీ, భద్రాచలం, రాయల తెలంగాణ ఇలా ఎన్నో డిమాండ్లు తెరమీదకు వస్తున్నా విజయశాంతి నోరు విప్పడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మానియా నేపథ్యంలో మళ్లీ రాములమ్మ సొంత గూటికే చేరుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఇక కమలం మాత్రం విజయశాంతి కోసం ఎప్పుడో తలుపులు తెరిచి పెట్టింది. ఆమెకు బీజేపీ అగ్రనేత అద్వానీతో సాన్నిహిత్యం ఉంది. అద్వానీ కూడా ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. దాంతో విజయశాంతి కూడా కమలం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
సోనియాతో విజయశాంతి భేటీ
ఎంపీ రేణుకతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి నివాసానికి ఉత్తరాంధ్ర జిల్లాలను తెలంగాణలో కలపాలి: రేణుక సాక్షి, న్యూఢిల్లీ: మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. అధికారికంగా కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరేది కచ్చితంగా తెలియకున్నా.. ఈ పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఆమె అధిష్టానం పెద్దల చేతుల మీదుగా ఇక్కడి కాంగ్రెస్ కార్యాలయంలోనే పార్టీ సభ్యత్వం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావే శాలకు హాజరయ్యేందుకు బుధవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన విజయశాంతి గురువారం సాయంత్రం రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి నేతృత్వంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నారు. పార్టీలో చేరే విషయమై ఆమెతో పది నిమిషాల పాటు మంతనాలు జరిపారు. విజయశాంతిని సోనియాకు పరిచయం చేసిన రేణుక.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సినీ పరిశ్రమలో రాణించి రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నారని, విజయశాంతి చేరికతో పార్టీ తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందని రేణుక వివరించినట్లుగా తెలిసింది. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు సోనియాకు విజయశాంతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సానుకూల నిర్ణయంతో కాంగ్రెస్‌కు తెలంగాణలో మైలేజీ పెరిగిందని, టీఆర్ఎస్ నేత లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని విజయశాంతి తెలిపినట్లుగా సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడలేదు. కాగా, ఈ భేటీపై రేణుకాచౌదరి స్పందిస్తూ ‘తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు సోనియాకు విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో ఎప్పుడు చేరేది ఆమెనే అడగండి’ అని అన్నారు. తాను తెలంగాణ ఆడబిడ్డనేనని, దీనిలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదని రేణుక చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తీరప్రాంతం ఉండాలని, ఈ దృష్ట్యా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తెలంగాణలో కలపాలని ఆమె డిమాండ్ చేశారు. భద్రాచలాన్ని తెలంగాణ నుంచి విడదీస్తే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో అనేక సమస్యలొస్తాయని ముఖ్యమంత్రి చెప్పడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె అన్నారు.