పట్నా : రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చింది. ఆర్జేడీ 20 స్ధానాల్లో, కాంగ్రెస్ 9 స్ధానాల్లో పోటీ చేసేలా ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయి. ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలోని రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ నాలుగు స్దానాల్లో, జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవాం మోర్చా మూడు స్ధానాల్లో, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ రెండు స్ధానాల్లో, వికాషీల్ ఇన్సాన్ పార్టీ ఒక స్ధానంలో పోటీ చేస్తాయని కూటమి వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, మహాకూటమి సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్, ఆర్జేడీలు బుధవారం అధికారికంగా ప్రకటించనున్నాయి. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో బీజేపీ, జేడీ(యూ)లు చెరి 17 సీట్లలో పోటీ చేయనుండగా, రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి ఆరు సీట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment