మహాకూటమితో దేశ ప్రజలకు ఒరిగేదేమీలేదని, కూటమి నేతలు కనీసం ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోల్‌కతా వేదికగా కలిసిన మహకూటమి సర్కార్‌ను దేశ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని తాము 55 నెలల్లో చేసి చూపామన్నారు.