ప్రజలే విజేతలు : మోదీ | Modi Says Real winners Of Lok Sabha Elections Are People Of India | Sakshi
Sakshi News home page

ప్రజలే విజేతలు : మోదీ

Published Thu, May 23 2019 9:22 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్ధులు విజయం సాధించలేదని, దేశ ప్రజలే ఈ ఎన్నికల్లో విజేతలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిన అనంతరం పార్టీ ప్రధాన కార్యలయంలో పార్టీ చీఫ్‌ అమిత్‌ షాతో కలిసి మోదీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయం ప్రజాస్వామ్య విజయమని, దీన్ని సగౌరవంగా ప్రజలకు అంకితం ఇస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన విజేతలందరికీ పార్టీలకు అతీతంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో 130 కోట్ల మంది ప్రజలు దేశం కోసం నిలబడ్డారని మోదీ కితాబిచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement