
హైదరాబాద్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కడియం శ్రీహరి, కావ్యకు దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కే. కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఫిరాయింపులు మొదలయ్యాయి. పలువురు నేతలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో వరసగా కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరటం ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో భారి విజయం సొంతం చేసుకున్న కాంగెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ అధిక సీట్ల గెలుపే టార్గెట్‌గా పావులు కదుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment