వరంగల్: అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలి.. అయితే అనుకున్న స్థాయిలో జరగలేదు.. తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి తోటలో పార్టీ ఘన్‌పూర్ గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
ముందుగా బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి పలువురు కడియం సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా నియోజవకర్గ ప్రజలతో మమేకమై అభివృద్ధిలో పాలుపంచుకున్నాను.. ఏనాడు తప్పుడు పనులు చేయలేదు.. ప్రజలకు తలవంపులు తేలేదని కడియం అన్నారు. పేదరికం నుంచి వచ్చిన తనకు వారి కష్టాలు తెలుసుని, పార్టీ పదవులు, ప్రభుత్వ పథకాల ఆశచూపి ఎవరి వద్దా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు.
పక్కనే ఉన్న పాలకుర్తి, వర్ధన్నపేట బాగా అభివృద్ధి చెందాయని, తనను ఆశీర్వదించి అవకాశం ఇస్తే స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు కలిపి మున్సిపాలిటీ చేయించి అభివృద్ధి చేస్తానన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్నగుప్తా, నీల గట్టయ్య, పోగుల సారంగపాణి, పురమాని రజాక్‌యాదవ్, గన్ను నర్సింహులు, తెల్లాకుల రామక్రిష్ణ, సింగపురం జగన్, రాజేష్‌నాయక్, డాక్టర్ జైహింద్‌రాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment