మాట్లాడుతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నేతలు
రామచంద్రాపురం(పటాన్‌చెరు) : ప్రైవేటు పాఠశాలలపై ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్సూర్ అహ్మద్, జిల్లా వర్కింగ్ ప్రిసిడెంట్ జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 40లక్షల మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నామన్నారు. సుమారు 4లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రైవేటు పాఠశాల బస్సులు గ్రామాల్లోకి వస్తే టైర్లలో గాలి తీయాలని ప్రజలను రెచ్చగొట్టడం డిప్యూటీ సీఎం హోదాకు తగదన్నారు. వెంటనే కడియం శ్రీహరి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాల అధ్యక్షుడు విలియంజేమ్స్, కోశాధికారి శేఖర్, సాయితేజ, రమణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment