విమానమొచ్చింది.. గేటేయండి..!
మన వద్ద రైలు రాగానే రెండు వైపులా వాహనాలు రాకుండా గేట్లు వేసేస్తారు. ఈ రైల్వే గేట్లు మనకు కామనే. ఇదే సీన్ విమానానికి ఎదురైతే.. విమానమొస్తుందంటూ వాహనాలు రాకుండా రెండు వైపులా గేట్లు వేస్తే ఎలాగుంటుంది. ఇలాంటి చిత్రమైన సన్నివేశం చూడాలంటే జిబ్రాల్టర్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ ఎయిర్‌పోర్టు రన్‌వే.. నాలుగు లేన్ల ప్రధాన రహదారికి మధ్యలో ఉంటుంది.
దీంతో విమానం వచ్చినప్పుడు లేదా వెళ్లినప్పుడల్లా రెండు వైపులా గేట్లు వేసేసి.. వాహనాలను నిలిపేస్తారు. విమానం వెళ్లగానే.. మళ్లీ వాహనాలు యధావిధిగా వెళ్లిపోతాయి. ఈ ఎయిర్‌పోర్టుకు స్థలం తక్కువగా ఉండటం.. సమతలంగా ఉన్న భూమి లేకపోవడంతో చివరికి ఇలా రోడ్డు మధ్యలో రన్‌వేను నిర్మించాల్సి వచ్చింది.