అంతా.. మా ఇష్టం ! | police vehicle in main road | Sakshi
Sakshi News home page

అంతా.. మా ఇష్టం !

Published Fri, Oct 14 2016 11:51 PM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM

అంతా.. మా ఇష్టం ! - Sakshi

అంతా.. మా ఇష్టం !

అనంతపురం సెంట్రల్‌ : నిబంధనలు సామాన్యులకే.. మాకు కాదంటున్నారు.. ట్రాఫిక్‌ పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారిపై కొరడా ఝుళిపించే ట్రాఫిక్‌ పోలీసులే నిబంధనలు తుంగలో తొక్కారు. నగర నడిబొడ్డున ఉన్న టవర్‌క్లాక్‌ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.40 సమయంలో దాదాపు అరగంట పాటు నడిరోడ్డుపై  పోలీసుల వాహనాన్ని వదిలివెళ్లారు.

సిబ్బంది ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే అక్కడి కేఫ్‌లో టీ తాగుతున్నారని స్థానికులు తెలిపారు. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ పోలీసుల తీరుపై స్థానికులు మండిపడ్డారు. వాహనం మరమ్మతుకు వచ్చిందా అని ట్రాఫిక్‌ డీఎస్పీ నర్సింగప్పను వివరణ కోరగా అలాంటిదేం లేదని, దీనిపై విచారణ జరుపుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement