టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికాతో మూడో వన్డే అనంతరం తనకు వచ్చిన 'ఇంపాక్ట్ ఫీల్డర్' అవార్డును యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు త్యాగం చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి మ్యాచ్‌లో అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు కోచ్ దిలీప్ అవార్డులను అందజేస్తున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో బెస్ట్ ఫీల్డర్‌గా కేఎల్ రాహుల్‌ను దిలీప్ ఎంపిక చేశాడు.
తొలి రెండు మ్యాచ్‌లతో పాటు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో సైతం రాహుల్ అద్భుతమైన మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. దీంతో రాహుల్‌కు ఇంపాక్ట్ ఫీల్డర్ అవార్డు వరించింది. అయితే రాహుల్ ఇక్కడే తన మంచిమనుసును చాటుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో సంచలన క్యాచ్‌ను అందుకున్న సాయిసుదర్శన్‌కు తన వచ్చిన మెడల్‌ను రాహుల్ ఇచ్చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాప్ చప్పట్లు కొడుతూ రాహుల్‌ను అభినందించారు.
సాయి సుదర్శన్ సంచలన క్యాచ్..
కాగా ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ మెరుపు క్యాచ్‌ను అందుకున్నాడు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి కాస్త గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్.. డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు. సుదర్శన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో టీమిండియా సొంతం చేసుకుంది.
India go on top with this great take by Sai Sudarshan 👌
— ESPNcricinfo (@ESPNcricinfo) December 21, 2023
Tune in to the 3rd #SAvIND ODI LIVE NOW | @StarSportsIndia #Cricket pic.twitter.com/115D7P6TS6
Comments
Please login to add a commentAdd a comment