నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, ఆతిథ్య జట్టును చిత్తు చేశారు. తొలుత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4).. ఆతర్వాత బ్యాటింగ్‌లో ఆటగాడు సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) సత్తా చాటారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత పేసర్ల ధాటికి 116 పరుగులకు కుప్పకూలగా.. టీమిండియా 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.
టార్గెట్ 117.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
23 పరుగుల వద్ద (3.4వ ఓవర్) టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వియాన్ ముల్దర్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
నిప్పులు చెరిగిన అర్ష్‌దీప్.. 116 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 116 పరుగుల వద్ద (27.3 ఓవర్లలో) కుప్పకూలింది. అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగగా.. ఆవేశ్ ఖాన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్‌కు ఆఖరి వికెట్ దక్కింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జి (28), ఫెహ్లుక్వాయో (33), మార్క్రమ్ (12), తబ్రేజ్ షంషి (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
అతి కష్టం మీద 100 పరుగుల మార్కును చేరిన సౌతాఫ్రికా 101 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫెహ్లుక్వాయో (33) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అర్షదీప్‌కు ఈ ఇన్నింగ్స్‌లో ఇది ఐదో వికెట్. మిగిలిన 4 వికెట్లను ఆవేశ్ ఖాన్ దక్కించుకున్నాడు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
73 పరుగుల వద్ద (16.1 ఓవర్‌లో) సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి కేశవ్ మహారాజ్ (4) ఔటయ్యాడు.
ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..
58 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (2) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 58/7గా ఉంది. ఫెహ్లుక్వాయో (3), కేశవ్ మహారాజ్ క్రీజ్‌లో ఉన్నారు. అర్ష్‌దీప్ సింగ్ 4, ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు.
► దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పది ఒవర్లు ముగిసే సమయానికి 52 పరుగులు చేసింది
► దక్షిణాఫ్రికా మూడో వికెట్‌ను కోల్పోయింది. డిజోర్జీ 28 పరుగుల వ్యక్తిగత స్కొర్ వద్ద అవుట్ అయ్యాడు. అనుదీప్ సింగ్ బౌలింగ్‌లో డిజోర్జీ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్‌కు దిగారు.
►6 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో డిజోర్జీ(17),మార్‌క్రమ్(4) పరుగులతో ఉన్నారు.
సింగ్ ఈజ్ కింగ్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ వరుసగా రీజా హెండ్రిక్స్, వాన్‌డెర్ డుసెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. 2 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 3/2
జోహన్నెస్‌బర్గ్ వేదికగా తొలి వన్డేలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో యువ సంచలనం సాయిసుదర్శన్ టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ చేతులు మీదగా సాయిసుదర్శన్ క్యాప్ అందుకున్నాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా పేసర్ బర్గర్ కూడా డెబ్యూ చేశాడు.
తుది జట్లు
భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, లోకేష్ రాహుల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
దక్షిణాఫ్రికా : టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షమ్సీ
Comments
Please login to add a commentAdd a comment