Kl Rahul(PC: Twitter)
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. వాండరర్స్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. భారత పేసర్ల దాటికి 27.3 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగగా.. అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
సౌతాఫ్రికా బ్యాటర్లలో ఫెహ్లుక్వాయో(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అరంగేట్ర ఆటగాడు సాయిసుదర్శన్(55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక విజయంపై భారత స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పేసర్లపై రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. జూనియర్ టీమ్‌తో దక్షిణాఫ్రికా వంటి జట్టుపై గెలవడం అంత ఈజీ కాదు. కానీ మా బాయ్స్ అందరి అంచనాలను తారుమారు చేశారు. ఈ మ్యాచ్‌లో అన్నీ మా ప్రణాళికలకు భిన్నంగా జరిగాయి. ఈ వికెట్‌పై తొందరగా స్పిన్నర్లను ఉపయోగించి ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాము. కానీ పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలించింది. దీంతో మా పేసర్లు అదరగొట్టారు.
బంతి కూడా టర్న్ అయింది. ఇటీవల కాలంలో ప్రతీఒక్కరూ చాలా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఫార్మాట్‌కు ప్రాధ్యన్యత ఇస్తున్నారు. ప్రస్తుతానికి టెస్టులు, టీ20లకే ఆదరణ ఎక్కువగా ఉంది. అయితే ప్రతీ ఒక్కరూ దేశమే కోసం అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం పొందేందుకు మంచి అవకాశమని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రాహుల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment