
సాయి సుదర్శన్ (Photo Credit: IPL Twitter)
IPL 2023- Hardik Pandya- Sai Sudharsan: ‘‘మ్యాచ్ ఆరంభంలో అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. పవర్‌ప్లేలో అదనంగా 15 -20 పరుగులు ఎక్కువే ఇచ్చాం. అయితే, ఆ తర్వాత మా బౌలర్లు పుంజుకున్న తీరు అద్భుతం. నాయకుడిగా మైదానంలో నేను తీసుకునే నిర్ణయాలు సరైనవేనని నా మనసు చెబుతుంది.
ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉంటేనే ధైర్యంగా ముందడుగు వేయగలం. మా జట్టు సభ్యులకు ఆటను పూర్తిగా ఆస్వాదించమని మాత్రమే చెబుతా. స్వేచ్ఛగా ఆడినప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. ఈ రోజు సాయి సుదర్శన్ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గత 15 రోజులుగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన అతడి అంకితభావానికి నేటి మ్యాచ్ రూపంలో మంచి ఫలితం దక్కింది.
రానున్న రెండేళ్లకాలంలో ఫ్రాంఛైజీ క్రికెట్ ఇంకా టీమిండియాలో కూడా సాయి సుదర్శన్ తన ప్రతిభతో కీలక ప్లేయర్‌గా ఎదుగుతాడనే నమ్మకం ఉంది. నిజానికి ఈ గెలుపులో సాయితో పాటు మా సహాయక సిబ్బందికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు.
సాయిపై ప్రశంసల జల్లు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సాయి సుదర్శన్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలుపుతో ఐపీఎల్-2023 సీజన్‌ను ఆరంభించిన హార్దిక్ సేన.. ఢిల్లీ వేదికగా రెండో విజయం నమోదు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో వార్నర్ బృందంతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సాయి
ఈ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ మొత్తంగా 48 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఛేజింగ్‌లో ఆరంభంలోనే తడబడిన గుజరాత్ టైటాన్స్‌ను మిల్లర్‌తో కలిసి గెలుపు తీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ సాయి సుదర్శన్‌పై ఈ మేరకు ప్రశంసలు కురిపించాడు.
ఐపీఎల్-2023: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు:
టాస్- గుజరాత్ టైటాన్స్- బౌలింగ్
ఢిల్లీ- 162/8 (20)
గుజరాత్- 163/4 (18.1).
చదవండి: ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం! వరల్డ్‌కప్ టోర్నీకి కూడా
Chasing with conviction! 💙⚡️#DCvGT | #AavaDe | #TATAIPL 2023pic.twitter.com/kFgqRVFcu0
— Gujarat Titans (@gujarat_titans) April 4, 2023