IPL 2023 GT Vs DC- Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘‘మరో ధోని కావాలని ఉత్సాహం ప్రదర్శిస్తున్న పాండ్యా.. కనీసం దినేశ్ కార్తిక్‌లా కూడా అవలేకపోతున్నాడు’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో రాణించి విజయతీరాలకు చేర్చేవాడే అసలైన నాయకుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ధోని ఫ్యాన్స్ అయితే.. ‘‘ఇంకోసారి తలాతో పాండ్యాను పోలిస్తే బాగుండదు’’ అని హెచ్చరిస్తున్నారు.
అండగా నిలబడ్డ గిల్
ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తమ కెప్టెన్‌కు అండగా నిలిచాడు. ప్రతీ బ్యాటర్ జీవితంలో ఇలాంటి గడ్డు పరిస్థితి వస్తుందని.. ఇది కూడా అలాంటిదేనంటూ విమర్శకులకు సమాధానమిచ్చాడు. కాగా ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఓపెనర్లు విఫలం
సొంతమైదానంలో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా సేన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ముఖ్యంగా ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(0), గిల్ (6) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వన్‌డౌన్‌లో వచ్చిన హార్దిక్ పాండ్యా 53 బంతుల్లో కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
జట్టును గెలిపించాలని తాపత్రయపడినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే పరిమితం కావడంతో.. పాండ్యా అజేయ ఇన్నింగ్స్‌కు ఏమాత్రం విలువ లేకుండా పోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో పాండ్యా స్ట్రైక్‌రేటు(111.32)ను ఉద్దేశించి నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి సహజం
ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘ఓ ఆటగాడిగా.. బ్యాటర్‌గా మా జీవితాల్లో ఇలాంటి ఒక మర్చిపోలేని రోజంటూ ఒకటి ఉంటుంది. అలాంటి వాటిలో ఇదీ ఒకటి. నిజానికి అతడు జట్టును గెలిపించేందుకు పోరాడాడు.
అయితే, ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు యార్కర్లు వేశారు. నిజానికి వికెట్ మరీ అంత కఠినంగా ఏమీ లేదు. కానీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో మేము విఫలమయ్యాం. ముఖ్యంగా టాపార్డర్ కారణంగా లోయర్ ఆర్డర్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది.
మా వల్లే ఇలా
ఇలాంటి లో స్కోరింగ్ మ్యాచ్‌లలో ఆరంభమే సరిగా లేనపుడు కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో అది తారస్థాయికి చేరుకుంటుంది. నిజమే వికెట్ టఫ్‌గానే ఉంది. కానీ మరీ 130 పరుగులను కూడా ఛేజ్ చేయలేనంత కఠినంగా అయితే లేదు’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక పాండ్యా జట్టును గెలిపించేందుకు కృషి చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. ఒకవేళ హార్దిక్ హిట్టింగ్ ఆడి త్వరగా అవుటైపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని.. ముందే ఓటమిని అంగీకరించాల్సిన దుస్థితి వచ్చేదని గిల్ పేర్కొన్నాడు. అభివన్ మనోహర్(33 బంతుల్లో 26 పరుగులు)తో కలిసి పార్ట్‌నర్‌షిప్ బిల్డ్ చేయడంలో పాండ్యా సఫలమయ్యాడని చెప్పుకొచ్చాడు.
చదవండి: అంతా నా వల్లే.. సారీ షమీ! పాపం రాహుల్... ఇకనైనా..
కోహ్లి- గంభీర్ గొడవ.. జరిగిందిదే! గౌతం ఆ మాట అనడంతో: ప్రత్యక్ష సాక్షి
A resounding away victory for @DelhiCapitals 🥳🥳#DC was full of belief tonight and they register a narrow 5-run win in Ahmedabad 👏🏻👏🏻
— IndianPremierLeague (@IPL) May 2, 2023
Scorecard ▶️ https://t.co/VQGP7wSZAj#TATAIPL | #GTvDC pic.twitter.com/GWGiTIshFY
Comments
Please login to add a commentAdd a comment