గంగూలీతో వార్నర్- అక్షర్ పటేల్ (Photo Credit: IPL/BCCI)
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించాడు. టాపార్డర్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37), సర్ఫరాజ్ ఖాన్(30) మినహా మిగతా వాళ్లు విఫలమైన వేళ అక్షర్ బ్యాట్ ఝులిపించాడు. ఈ స్పిన్ ఆల్‌రౌండర్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేయగలిగింది. కానీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్‌ను సాయి సుదర్శన్(62), డేవిడ్ మిల్లర్ (31) ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయతీరాలకు చేర్చారు.
దీంతో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఐపీఎల్-2023లో వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. గుజరాత్‌తో మ్యాచ్‌లో అక్షర్ చేతికి వార్నర్ బంతినివ్వకపోవడం చర్చనీయాంశమైంది.
అందుకే అక్షర్ చేతికి బంతినివ్వలేదు.. అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఢిల్లీ కెప్టెన్ వార్నర్ భాయ్.. తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘మ్యాచ్ ఆరంభంలోనే గుజరాత్ సీమర్లను చూసి నేను ఆశ్చర్యపోయాననుకోకండి. నిజానికి ఊహించిన దానికంటే బంతి మరింత ఎక్కువగా స్వింగ్ అయింది.
పరిస్థితులకు అనుగుణంగా ఎలా బౌలింగ్ చేయాలో వాళ్లు(గుజరాత్) చూపించారు. ఇంకా ఇక్కడ మరో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆరంభ ఓవర్లలో బంతి ఇలాగే స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఆఖరి వరకు మేము గెలుస్తామనే నమ్మకం ఉండింది.
అయితే, సాయి అద్బుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. ఇక మిల్లర్ గురించి చెప్పేదేముంది. అతడు ఏం చేయగలడో అదే చేశాడు. నిజానికి డ్యూ(తేమ) ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట 180-190 వరకు స్కోర్ చేస్తేనే మ్యాచ్‌ను కాపాడుకోగలం.
అంతేగానీ అతడికి(అక్షర్‌ను ఉద్దేశించి) బౌలింగ్ ఇవ్వకపోవడం వల్ల కాదు’’ అని వార్నర్ తెలిపాడు. సీమర్లకు అనుకూలించే వికెట్‌పై స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేతికి బంతినివ్వలేదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 18 పరుగులు ఇచ్చాడు.
చదవండి: IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు
DC Vs GT: రానున్న రెండేళ్లలో ఫ్రాంఛైజ్ క్రికెట్‌తో పాటు టీమిండియాలో కూడా!
Double delight for @gujarat_titans 🙌🙌
— IndianPremierLeague (@IPL) April 4, 2023
They win their second consecutive game of #TATAIPL 2023 and move to the top of the Points Table.
Scorecard - https://t.co/tcVIlEJ3bC#DCvGT pic.twitter.com/WTZbIZTQmm
Comments
Please login to add a commentAdd a comment