IPL 2023, GT Vs DC: David Miller Again Proved How He Dangerous When He Gets Life - Sakshi
Sakshi News home page

David Miller: అందుకే మిల్లర్‌ను 'కిల్లర్‌' అనేది

Published Tue, Apr 4 2023 11:48 PM | Last Updated on Wed, Apr 5 2023 8:35 AM

David Miller Again Proved How He Dangerous When He Gets Life DC Vs GT - Sakshi

సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ను ముద్దుగా కిల్లర్‌ మిల్లర్‌ అని పిలుస్తుంటారు. ఎందుకంటే అతను క్రీజులో పాతుకుపోయాడంటే క్షణాల్లో మ్యాచ్‌ను మార్చేయగల సత్తా ఉన్నవాడు.  అందుకే అతను క్రీజులో కుదురుకునే లోపే ఔట్‌ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తాను ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడో ఆపడం ఎవరి తరం కాదు.

గతేడాది ఐపీఎల్‌లోనే మిల్లర్‌ విధ్వంసం ఎలా ఉంటుందో అందరం చూసే ఉంటాం. తాజాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లోనూ తన వేటను ఆరంభించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌తో కలిసి మిల్లర్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ఎల్బీగా అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంతో మిల్లర్‌ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 16 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు నాటౌట్‌గా నిలిచి గుజరాత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఐపీఎల్‌కు రావడానికి ముందు నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో మిల్లర్‌ 61 బంతుల్లోనే 91 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. వచ్చిన ఒక్కరోజు గ్యాప్‌లోనే ఐపీఎల్‌లో తన పవర్‌ ఏంటో చూపించాడు. ఇకపై తనతో అన్ని జట్లు జాగ్రత్తగా ఉండాల్సిందే అని మిల్లర్‌ పరోక్షంగా హెచ్చరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement