గుజరాత్‌ను గెలిపించిన సాయి సుదర్శన్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్ 48 బంతుల్లో 62 పరుగులతో నాటౌట్ ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. అతనికి డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 31 పరుగులు నాటౌట్), విజయ్ శంకర్(23 బంతుల్లో 29 పరుగులు) సహకరించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్‌లు తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్ 37, సర్ఫరాజ్ ఖాన్ 30 పరుగులు చేయగా.. చివర్లో అక్షర్ పటేల్ 22 బంతుల్లో 36 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ 160 పరుగుల మార్క్ అందుకునేలా చేశాడు.గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
టార్గెట్ 163.. గుజరాత్ స్కోరు 106/3
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ లక్ష్యం దిశగా సాగుతుంది. ప్రస్తుతం గుజరాత్ 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 39, విజయ్ శంకర్ 29 పరుగులతో ఆడుతున్నారు.
టార్గెట్ 163.. 44 పరుగులకు రెండు వికెట్లు డౌన్
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్లు నష్టపోయి 49 పరుగులతో ఆడుతుంది. సాయి సుదర్శన్ 13, పాండ్యా 5 పరుగుతో క్రీజులో ఉన్నాడు.
Photo Credit : IPL Website
రాణించిన అక్షర్ పటేల్.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 163
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్ 37, సర్ఫరాజ్ ఖాన్ 30 పరుగులు చేయగా.. చివర్లో అక్షర్ పటేల్ 22 బంతుల్లో 36 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ 160 పరుగుల మార్క్ అందుకునేలా చేశాడు.గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Photo Credit : IPL Website
16 ఓవర్లలో ఢిల్లీ స్కోరు ఎంతంటే?
16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. తెవాటియా అద్బుత క్యాచ్‌కు రిలీ రొసౌ గోల్డెన్ డక్ అయ్యాడు. అంతకముందు వార్నర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
8 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 67/2
8 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. వార్నర్ 37, సర్ఫరాజ్ ఖాన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
ఢిల్లీ క్యాపిటల్స్‌ను షమీ దెబ్బతీశాడు. మిచెల్ మార్ష్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ రెండో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకముందు పృథ్వీ షా(7 పరుగులు) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి అల్జారీ జోసెఫ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అమన్ హకీమ్ ఖాన్, అన్రిచ్ నోర్ట్జే, ముఖేష్ కుమార్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్
The 🪙 is flipped, and it falls in favour of @gujarat_titans. The away team opt to field first in #DCvGT 🏏
Tune in to #IPLonJioCinema NOW - streaming LIVE and FREE for all telecom operators! #IPL2023 #TATAIPL #JioCinema | @DelhiCapitals pic.twitter.com/Q6StI8eFvX
— JioCinema (@JioCinema) April 4, 2023
ఇప్పటిదాకా ఐపీఎల్‌లో జరిగిన మొదటి 6 మ్యాచుల్లో 5 సార్లు హోం గ్రౌండ్‌లో ఆడిన జట్లే విజయం సాధించాయి. ఒక్క ఎస్‌ఆర్‌హెచ్ మాత్రమే హోంగ్రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో 50 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్...హోం గ్రౌండ్ సెంటిమెంట్‌పైనే ఆశలు పెట్టుకుంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆఖరి ఓవర్‌లో విజయం సాధించి, సీజన్‌ని ఘనంగా ఆరంభించింది.
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు లుంగి ఇంగిడి, ఆన్రీచ్ నోకియా రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ పటిష్టంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అభిషేక్ పోరెల్ నేటి మ్యాచ్‌లో ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో గాయపడిన కేన్ విలియమ్సన్ స్థానంలో డేవిడ్ మిల్లర్, విజయ్‌శంకర్ స్థానంలో సాయి సుదర్శన్ తుది జట్టులోకి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment