IPL 2023: GT vs DC Match 44 Live Updates And Highlights - Sakshi
Sakshi News home page

గుజరాత్‌కు షాక్‌.. ఉత్కంఠపోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

Published Tue, May 2 2023 7:24 PM | Last Updated on Tue, May 2 2023 11:13 PM

IPL 2023: Gujarat Titans Vs Delhi Capitals Match Live Updates - Sakshi

గుజరాత్‌కు షాక్‌.. ఉత్కంఠపోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం
గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 131 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా 59 పరుగులు నాటౌట్‌ ఆఖరి వరకు నిలిచినప్పటికి గెలిపించలేకపోయాడు.

ఆఖర్లో తెవాటియా సిక్సర్లతో హల్‌చల్‌ చేసినప్పటికి ఇషాంత్‌ అనుభవానికి లొంగిపోయాడు. దీంతో ఢిల్లీ ఐదు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. నోర్ట్జే, కుల్దీప్‌ యాదవ్‌లు చెరొక వికెట్‌ పడగొట్టారు.

14 ఓవర్లలో గుజరాత్‌ టైటాన్స్‌ 71/4
14 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్‌ టైటాన్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా 36, అభినవ్‌ మనోహర్‌ 19 పరుగులతో ఆడుతున్నారు.

మిల్లర్‌ డకౌట్‌.. నాలుగో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కష్టాల్లో పడింది. 131 పరుగులతో బరిలోకి దిగిన గుజరాత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ మిల్లర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 8 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.

టార్గెట్‌ 131.. 26 పరుగులకే మూడు వికెట్లు డౌన్‌
131 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌కు షా​క్‌ తగిలింది. వరుస ఓవర్లలో వికెట్లు పడడంతో గుజరాత్‌ ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.

Photo Credit : IPL Website

గుజరాత్‌ టైటాన్స్‌ టార్గెట్‌ 131
గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. అమన్‌ ఖాన్‌ 51 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. రిపల్‌ పటేల్‌ 23 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఒక దశలో 73 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో అమన్‌ ఖాన్‌, రిపల్‌ పటేల్‌ 50 పరుగులు జోడించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. గుజరాత్‌ బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. మోహిత్‌ శర్మ రెండు, రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.


Photo Credit : IPL Website

15 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 78/6
15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. అమన్‌ ఖాన్‌ 24, రిపల్‌ పటేల్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.


Photo Credit : IPL Website

చెలరేగుతున్న షమీ.. 23 పరుగులకే ఐదు వికెట్లు డౌన్‌
గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో చెలరేగుతున్నాడు. మూడు ఓవర్లు బౌలింగ్‌ వేసిన షమీ ఏడు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 23 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తాజాగా 10 పరుగులు చేసిన ప్రియమ్‌ గార్గ్‌ షమీ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.


Photo Credit : IPL Website

16 పరుగులకే మూడు వికెట్లు డౌన్‌
గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. షమీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే ఫిల్‌ సాల్డ్‌ గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో వార్నర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం షమీ బౌలింగ్‌లో రిలీ రొసౌ(8) సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


Photo Credit : IPL Website

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో అహ్మదాబాద్‌ వేదికగా 44వ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), మనీష్ పాండే, రిలీ రోసోవ్, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్

ఒకవైపు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు.. రెండు ఓటములతో టాప్‌ స్థానంలో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌..  ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఆరు ఓటములతో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మ్యాచ్‌ జరగనుండడంతో అంత ఆసక్తి లేనప్పటికిక.. ఢిల్లీ ఏదైనా అద్బుతం చేస్తుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement