India A Squad For ACC Men's Emerging Teams Asia Cup 2023 Yash Dhull To Lead - Sakshi
Sakshi News home page

Asia Cup- India A: ఆసియా కప్‌-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌రెడ్డికి చోటు

Published Tue, Jul 4 2023 7:05 PM | Last Updated on Tue, Jul 4 2023 7:53 PM

India A Squad For ACC Men Emerging Teams Asia Cup 2023 Yash To Lead - Sakshi

ACC Men’s Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌-2023కి భారత్‌ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్‌ క్రికెట్‌ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్‌ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. 

ఎనిమిది ఆసియా దేశాల మధ్య  ఇండియా- ఏ జట్టుకు యశ్‌ ధుల్‌ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. అభిషేక్‌ శర్మ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు. తెలుగు క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌రెడ్డి సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టీమ్‌కి సితాంషు కొటక్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

శ్రీలంకలో..
జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్‌ ఆసియా కప్‌-2023 నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందులో గ్రూప్‌-బిలో భారత్‌తో పాటు.. నేపాల్‌, యూఏఈ, పాకిస్తాన్‌- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఒమన్‌- ఏ జట్లు గ్రూప్‌-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. 

ఆరోజు ఫైనల్‌
ఇందులో గ్రూప్‌-ఏ టాపర్‌తో గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్‌-బి టాపర్‌తో గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి.  జూలై 23న ఈ టోర్నీ ఫైనల్‌ జరుగనుంది. ఇదిలా ఉంటే తొలిసారి నిర్వహించిన మహిళల ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ విజేతగా భారత జట్టు అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో బంగ్లాదేశ్‌-ఏ జట్టును చిత్తు చేసి భారత మహిళల- ఏ జట్టు చాంపియన్‌గా నిలిచింది.

ఎమర్జింగ్‌ ఏసియా కప్‌-2023 భారత- ఏ జట్టు
సాయి సుదర్శన్‌, అభిషేక్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), నికిన్‌ జోస్‌, ప్రదోష్‌ రంజన్‌ పాల్‌, యశ్‌ ధుల్‌(కెప్టెన్‌), రియాన్‌ పరాగ్‌, నిశాంత్‌ సంధు, ప్రభ్‌షిమ్రన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌), మానవ్‌ సుతార్‌, యువరాజ్‌సిన్హ్‌ దోడియా, హర్షిత్‌ రానా, ఆకాశ్‌ సింగ్‌, నితీశ్‌ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్‌ హంగ్రేకర్‌.

స్టాండ్‌ బై ప్లేయర్లు: హర్ష్‌ దూబే, నేహాల్‌ వధేరా, స్నెల్‌ పటేల్‌, మోహిత్‌ రేద్కార్‌.
కోచింగ్‌ స్టాఫ్‌: సితాంశు కొటక్‌(హెడ్‌కోచ్‌), సాయిరాజ్‌ బహూతులే (బౌలింగ్‌ కోచ్‌), మునిష్‌ బాలి(ఫీల్డింగ్‌ కోచ్‌).

చదవండి: Ashes: ‘బజ్‌బాల్‌’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌.. సిరీస్‌ మొత్తానికి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement