డబుల్‌ సెంచరీ బాదిన సాయి సుదర్శన్‌.. సెంచరీకి చేరువలో సుందర్‌ | Ranji Trophy 2024: Sai Sudharsan Smashes His Maiden Double Century In First Class Cricket | Sakshi
Sakshi News home page

డబుల్‌ సెంచరీ బాదిన సాయి సుదర్శన్‌.. సెంచరీకి చేరువలో సుందర్‌

Published Fri, Oct 18 2024 6:29 PM | Last Updated on Fri, Oct 18 2024 6:40 PM

Ranji Trophy 2024: Sai Sudharsan Smashes His Maiden Double Century In First Class Cricket

రంజీ ట్రోఫీ-2024 ఎలైట్‌ గ్రూప్‌-డి పోటీల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ అజేయ డబుల్‌ సెంచరీతో (202) విరుచుకుపడగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్‌ సుందర్‌ సెంచరీకి (96 నాటౌట్‌) చేరువయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 379 పరుగులు చేసింది. ఎన్‌ జగదీశన్‌ 65 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. నవ్‌దీప్‌ సైనీకి జగదశన్‌ వికెట్‌ దక్కింది.

కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్‌ ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా భీకర ఫామ్‌లో ఉన్నాడు. సాయి 2023 నుంచి పాకిస్తాన్‌-ఏపై, ఇంగ్లండ్‌-ఏపై, ఐపీఎల్‌లో, తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ నాకౌట్స్‌లో, కౌంటీ క్రికెట్‌లో, దులీప్‌ ట్రోఫీలో, రంజీ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. 23 ఏళ్ల సాయి సుదర్శన్‌  ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి ఆరు సెంచరీలు చేశాడు. అలాగే లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 28 మ్యాచ్‌లు ఆడి ఆరు సెంచరీలు బాదాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement