
గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు, చెన్నైకు చెందిన యువ క్రికెటర్ సాయి సుదర్శన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో లైకా కోవై కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిసుదర్శన్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా మూడో హాఫ్ సెంచరీ సెంచరీ సాధించాడు.
ఈ టోర్నీలో భాగంగా సోమవారం చెపాక్ సూపర్ గిల్లీస్‌తో జరిగిన అర్ధ శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. అతడి అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా 127 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే కోవై కింగ్స్ ఛేదించింది.
ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్ 120 సగటుతో 240 పరుగులు చేశాడు. అదే విధంగా ఐపీఎల్‌లో కూడా సుదర్శన్ అదరగొట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి, గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించాడు. ఈ ఏడాది సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సాయి 50 పైగా సగటుతో 362 పరుగులు సాధించాడు.
టీమిండియాలోకి ఎంట్రీ..
ఇక భీకర ఫామ్‌లో ఉన్న సాయిసుదర్శన్ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు సాయిసుదర్శన్‌ను ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి హార్దిక్ కూడా సుదర్శన్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఇక సుదర్శన్‌తో పాటు జైశ్వాల్, రింకూ సింగ్‌కు కూడా చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం.. ఆంధ్రా టీమ్ లేకపోవడమే నయం'
Comments
Please login to add a commentAdd a comment