Two Bouncers In An Over: BCCI Allowed New Rules In Syed Mushtaq Ali Trophy - Sakshi
Sakshi News home page

BCCI New Rules: క్రికెట్‌లో కొత్త రూల్‌.. ఇకపై ఓవర్‌కు..!

Published Sun, Jul 9 2023 3:47 PM | Last Updated on Sun, Jul 9 2023 4:07 PM

Two Bouncers In An Over: BCCI Allowed New Rules In Syed Mushtaq Ali Trophy - Sakshi

దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త రూల్‌ను అమల్లోకి తేనుంది. త్వరలో ప్రారంభంకానున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ఓవర్‌కు రెండు బౌన్సర్లకు అనుమతిచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు టీ20ల్లో ఓవ‌ర్‌కు ఒకే బౌన్స‌ర్ నిబంధన అమల్లో ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌కు మధ్య పోటీని బ్యాలెన్స్‌ చేసేందుకు ఈ రూల్‌ను అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.

ఈ రూల్‌తో పాటు మరో నిబంధనను కూడా ముస్తాక్‌ అలీ టోర్నీలో అమల్లోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధన స‌క్సెస్ కావ‌డంతో ఆ రూల్‌ను కూడా ముస్తాక్ అలీ టోర్నీలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

కాగా, ముస్తాక్ అలీ టోర్నీలో రెండు బౌన్సర్లు, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్స్‌ స‌క్సెస్ అయితే మిగిలిన దేశ‌వాళీ టోర్నీల్లోనూ ఈ రెండు రూల్స్‌ను అమల్లోకి తెస్తారని సమాచారం. టీ20 ఫార్మాట్‌లో రెండు బౌన్సర్ల నిబంధన అమల్లోకి తెస్తే బౌల‌ర్ల ప్ర‌భావం పెరిగే అవ‌కాశం ఉంద‌ని బీసీసీఐ అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే, 2023-24 స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబ‌ర్ 16 నుంచి న‌వంబ‌ర్ 6 వ‌ర‌కు జ‌రుగ‌నుంది. ఈ టోర్నీలో మొత్తం 38 టీమ్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement