దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌ | BCCI Green Signal Indian Domestic Season Syed Mushtaq Ali Trophy | Sakshi
Sakshi News home page

దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌

Published Sun, Dec 13 2020 8:07 PM | Last Updated on Sun, Dec 13 2020 8:14 PM

BCCI Green Signal Indian Domestic Season Syed Mushtaq Ali Trophy - Sakshi

2019-20 విజేత కర్ణాటక జట్టు సభ్యులు

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ ఆదివారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జనవరి 10 నుంచి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ-20 టోర్నమెంట్‌ నిర్వహణకు ఓకే చెప్పింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా అన్ని రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులకు సమాచారం ఇచ్చారు. కరోనా వైరస్‌ కారణంగా దాదాపు ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్‌ అభిమానులను అలరించనుంది. ఇక ముస్తాక్‌ అలీ టోర్నీకి సంబంధించి ఇప్పటివరకైతే వేదికల్ని నిర్ణయించలేదు. జనవరి 2 తర్వాత ఏయే వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారో ఫైనల్‌ కానుంది. ఇదిలాఉండగా.. కరోనా భయాల నేపథ్యంలో బీసీసీఐ ఐసీఎల్‌-2020 ని దుబాయ్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ అనంతరం భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లింది. అటు తర్వాత వచ్చే ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత దేశంలో జరిగే తొలి అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నీ అదే కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement