Domestic season
-
2024-25 దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ
2024-25 దేశవాళీ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న (జూన్ 6) విడుదల చేసింది. ఈ సీజన్ సెప్టెంబర్ 5న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో మొదలై 2025 ఏప్రిల్ 1న జరిగే సీనియర్ మహిళల ఛాలెంజర్ ట్రోఫీతో ముగుస్తుంది. ఈ మధ్యలో సీనియర్ పురుషులు, మహిళలకు సంబంధించిన పలు మల్టీ ఫార్మాట్ ట్రోఫీలతో పాటు పలు జూనియర్ స్థాయి టోర్నీలు జరుగనున్నాయి. 2024-25 క్యాలెండర్ ఇయర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.దేశవాళీ క్రికెట్లో ప్రముఖ టోర్నీలైన రంజీ ట్రోఫీ ఈ ఏడాది అక్టోబర్ 11న మొదలై వచ్చే ఏడాది మార్చి 2న ముగుస్తుంది. రంజీ ట్రోఫీకి ముందు దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్.. రంజీ ట్రోఫీ మధ్యలోనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ జరుగనున్నాయి.2024-25 దేశవాళీ సీజన్ క్యాలెండర్..ముఖ్యమైన టోర్నీలకు సంబంధించిన వేదికల వివరాలు..VENUES & DATES OF INDIAN DOMESTIC CRICKET 2024-25...!!!! pic.twitter.com/LBuRy4hSjg— Johns. (@CricCrazyJohns) June 6, 2024 -
దేశవాలీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2023-24 దేశవాలీ క్రికెట్ సీజన్ షెడ్యూల్‌ను ఇవాళ (జూన్ 18) విడుదల చేసింది. ఈ సీజన్ 28 జూన్ 2023 నుంచి 14 మార్చి 2024 వరకు సాగనుంది. దులీప్ ట్రోఫీతో ప్రారంభమయ్యే ఈ సీజన్లో మొత్తం 1846 మ్యాచ్‌లు జరుగనున్నాయి. జూన్ 28న మొదలయ్యే దులీప్ ట్రోఫీ జులై 16న ముగుస్తుంది. ఆ వెంటనే జులై 24-ఆగస్ట్ 4 మధ్యలో దియోధర్ ట్రోఫీ జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లో ఆరు జోన్ల జట్లు (సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్-ఈస్ట్) పాల్గొంటాయి. ఈ రెండు టోర్నీల తర్వాత అక్టోబర్ 1 నుంచి 5 వరకు రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర-రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ జరుగుతుంది. ఈ మూడు మల్టీ డే ఫార్మాట్ (టెస్ట్ ఫార్మాట్) టోర్నీల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20 ఫార్మాట్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే ఫార్మాట్) లు మొదలవుతాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుండగా.. విజయ్ హజారే ట్రోఫీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగుతుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల టోర్నీల్లో మొత్తం 38 జట్లు పోటీపడతాయి. 2024 జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ.. 2024 జనవరి 5 నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ మొదలవుతుంది. మార్చి 14 వరకు సాగే ఈ టోర్నీలోనూ మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో మొత్తం జట్లు 5 గ్రూపులుగా (గ్రూప్-ఏ,బి,సీ,డీ, ప్లేట్) విభజించబడతాయి. ఇక మహిళల క్రికెట్ విషయానికొస్తే.. సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీతో మహిళల డొమెస్టిక్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు సాగుతుంది. ఆతర్వాత నవంబర్ 24-డిసెంబర్ 4 మధ్యలో సీనియర్ వుమెన్స్ ఇంటర్ జోనల్ ట్రోఫీ జరుగుతుంది. దీని తర్వాత జనవరి 4, 2024 నుంచి సీనియర్ వుమెన్స్ వన్డే ట్రోఫీ మొదలవుతుంది. ఈ టోర్నీ జనవరి 26 వరకు సాగుతుంది. -
థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్.. నరాలు తెగే ఉత్కంఠ.. అనూహ్య మలుపులు
ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే కప్ (మార్ష్ కప్) 2022-23 సీజన్లో రసవత్తర సమరం జరిగింది. థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఓ మ్యాచ్ అనూహ్య మలుపులకు వేదికైంది. గబ్బా వేదికగా క్వీన్స్‌ల్యాండ్-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో క్వీన్స్‌ల్యాండ్ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్‌ల్యాండ్.. 49.5 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం న్యూసౌత్ వేల్స్ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయి (49.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్) ఓటమిపాలైంది. Watch this crazy final over that included a six, an injured bowler on debut, another debutant bowling his first over halfway through the last over to replace him, and a run out that sealed a thrilling win for Queensland https://t.co/CREqRlj00C — cricket.com.au (@cricketcomau) February 26, 2023 చివరి ఓవర్లో న్యూసౌత్ వేల్స్ గెలవాలంటే 14 పరుగులు చేయాల్సి ఉండగా (చేతిలో 2 వికెట్లు ఉన్నాయి).. స్టీవెన్ మెక్గిఫిన్ వేసిన తొలి బంతినే డ్వార్షుయిష్ సిక్సర్‌గా మలిచి గెలుపుపై ధీమాను పెంచాడు. అయితే ఆతర్వాత బంతికే డ్వార్షుయిష్ (20 బంతుల్లో 44; 5 సిక్సర్లు).. బ్లేక్ ఎడ్వర్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక్కడే మ్యాచ్‌లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. Huge wicket for the Bulls and we have a thrilling finish coming up! #MarshCup pic.twitter.com/K0WJ4trzBp — cricket.com.au (@cricketcomau) February 26, 2023 గజ్జల్లో గాయం కారణంగా స్టీవెన్ మెక్గిఫిన్ తప్పుకోవడంతో జోష్ బ్రౌన్ బంతిని అందుకున్నాడు. బ్రౌన్ వేసిన మూడో బంతి డాట్ బాల్ కాగా.. నాలుగో బంతిని లియామ్ హ్యచర్ బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్లో 5 పరుగులు చేయల్సిన తరుణంలో లియామ్ హ్యాచర్ రనౌట్ కావడంతో మ్యాచ్ ముగిసింది. గెలుపుపై ధీమాగా ఉన్న న్యూసౌత్ వేల్స్ చివరి ఓవర్లో చతికిలపడి ఓటమిపాలైంది. ఈ విజయంలో క్వీన్స్‌ల్యాండ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో సీజన్‌ను ముగించగా.. న్యూసౌత్‌వేల్స్ చిట్టచివరి ప్లేస్‌తో సీజన్‌ను ముగించింది. ఫైనల్ మ్యాచ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా-సౌత్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 8న జరుగుతుంది. -
దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ ఆదివారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నమెంట్ నిర్వహణకు ఓకే చెప్పింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఇక ముస్తాక్ అలీ టోర్నీకి సంబంధించి ఇప్పటివరకైతే వేదికల్ని నిర్ణయించలేదు. జనవరి 2 తర్వాత ఏయే వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారో ఫైనల్ కానుంది. ఇదిలాఉండగా.. కరోనా భయాల నేపథ్యంలో బీసీసీఐ ఐసీఎల్-2020 ని దుబాయ్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ అనంతరం భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లింది. అటు తర్వాత వచ్చే ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత దేశంలో జరిగే తొలి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ అదే కానుంది. -
దేశవాళీ సీజన్ నుంచి రాజస్థాన్ అవుట్!
ముంబై: తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్షుడిగా లలిత్ మోడిని ఎన్నుకున్నందుకు బీసీసీఐ తగిన చర్యలకు దిగినట్టే కనిపిస్తోంది. వచ్చే దేశవాళీ సీజన్ షెడ్యూల్లో ఆర్‌సీఏను పేర్కొనలేదు. అండర్-16, 19, 23, రంజీ ట్రోఫీ, మహిళల టోర్నీ పోటీల వివరాలతో కూడిన హ్యాండ్‌బుక్‌ను బోర్డు అన్ని గుర్తింపు సంఘాలకు పంపిణీ చేసింది. అయితే ఇందులో రాజస్థాన్ ఊసు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివిధ అంశాలపై ఆర్‌సీఏతో బీసీసీఐకి విబేధాలున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌సీఏను దేశవాళీ సీజన్ నుంచి మేం తొలగించలేదు. వారి కోసం స్లాట్‌ను ఉంచాం. ప్రభుత్వ, బోర్డు అంతర్గత నిర్ణయాలపై ఆధారపడి ఏ విషయాన్నీ ఖరారు చేస్తాం. రాజస్థాన్ ఆటగాళ్లతో పాటు అందరూ ఆడాలనే కోరుకుంటున్నాం. అన్ని సమస్యలు పరిష్కారమై సీజన్లో అన్ని రాష్ట్రాలు ఆడతాయనే ఆశిస్తున్నాను’ అని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్ అన్నారు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఇంటర్ స్టేట్ జూనియర్ క్రికెట్ టోర్నీకి ముందు ఆర్‌సీఏపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు బీసీసీఐ హ్యాండ్‌బుక్‌ను తామింకా చూడలేదని ఆర్సీఏ ఉపాధ్యక్షుడు మెహమూద్ అబ్ది పేర్కొన్నారు. క్రికెట్ కార్యకలాపాలకు బింద్రా దూరం చండీగఢ్: 36 ఏళ్లుగా క్రికెట్ పాలనాధికారిగా సేవలందిస్తున్న ఇందర్జిత్ సింగ్ బింద్రా ఇక విశ్రాంతి తీసుకోనున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. బింద్రా స్థానంలో డీపీ రెడ్డిని నియమించారు. పీసీఏ రోజువారీ వ్యవహారాలను చూడలేకపోతున్నందుకు తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా పీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని బింద్రా కోరారు.