IPL 2023: Fans Slam Prithvi Shaw For His Continuous Failures - Sakshi
Sakshi News home page

IPL 2023- Prithvi Shaw : ఇక్కడే ప్లేస్‌కు దిక్కు లేదు.. ఇంకా టీమిండియాలో చోటు కావాలంట!

Published Sun, Apr 9 2023 12:21 PM | Last Updated on Sun, Apr 9 2023 1:00 PM

Fans Slams Prithvi Shaw Poor Performance in Ipl 2023 - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌, భారత యువ ఆటగాడు పృథ్వీ షా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు అతడు నిరాశే మిగులుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో  12, 7 పరుగులు చేసి విఫలమైన పృథ్వీ షా.. తాజాగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ షా.. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

దీంతో అతడిపై సర్వాత్ర తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే ఆట తీరును అతడు కొనసాగిస్తే భారత జట్టులో కాదు కదా, ముంబై దేశవాళీ జట్టులో కూడా చోటు దక్కడం కష్టమని పలువరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక నెటిజన్లు అయితే పృథ్వీ షాను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక్కడే సరిగ్గా ఆడలేకపోతున్నాడు, ఇంకా భారత జట్టులో చోటు కావాలంట అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. సాయిబాబా చూస్తే కాదు.. మన ప్రదర్శన, కష్టం కూడా ఉండాలి అని కామెంట్‌ చేశాడు. కాగా ఇంతకుముందు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై  పృథ్వీ షా సెలెక్షన్ కమిటీ తీరును పరోక్షంగా తప్పుబట్టాడు.

"సాయిబాబా అంతా చూస్తున్నారని ఆశిస్తున్నాను" అని పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. అనంతరం న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికైనప్పటకీ.. ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశమే దక్కలేదు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ పృథ్వీ షా నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
చదవండిAjinkya Rahane: బీసీసీఐ అవసరములేదని పొమ్మంది.. ఆ కసిమొత్తం ఇక్కడ చూపించేశాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement