న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు భారత జట్లను బీసీసీఐ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో స్థానం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యువ ఓపెనర్ పృథ్వీ షాకు మరో సారి నిరాశే ఎదురైంది. ఈ సిరీస్‌లకు సెలక్టర్లు అతడి వైపు మొగ్గు చూపలేదు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. ఎంపిక చేయకపోవడంపై సెలెక్టర్లుపై పృథ్వీ షా మరో సారి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
తన అసంతృప్తిని నేరుగా వెళ్లగక్కకున్నా.. పరోక్ష వ్యాఖ్యలతో సెలెక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ఈ సిరీస్‌లకు జట్లను ప్రకటించిన తర్వాత.. షా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ నోట్‌ను పోస్ట్ చేశాడు. "సాయిబాబా అంతా చూస్తున్నారని ఆశిస్తున్నాను" అని పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇక జట్లను ప్రకటించిన తర్వాత భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పృథ్వీ షా ఎంపిక గురించి విలేకరులు చేతన్ శర్మను ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. "పృథ్వీ మా దృష్టిలో ఉన్నాడు. అతడితో మేము నిరంతరం టచ్‌లో ఉన్నాం. అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం భారత జట్టులో ఆడుతున్న యువ ఆటగాళ్లకు మరో అవకాశం ఇచ్చాం. పృథ్వీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. అతడికి త్వరలోనే ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది" అని చేతన్ శర్మ సమాధానమిచ్చాడు.
The Instagram story of Prithvi Shaw. pic.twitter.com/wAT0vRp3vQ
— Johns. (@CricCrazyJohns) October 31, 2022
చదవండి: Dewald Brevis: జూనియర్ 'ఏబీడీ' విధ్వంసం.. 57 బంతుల్లో 162 పరుగులు
Comments
Please login to add a commentAdd a comment