World Test Championship: టీమిండియా యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, పృథ్వీ షా టెస్టు జట్టులో ఉంటే తిరుగే ఉండదని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడే ఈ యువ కెరటాలు కలిసి ఆడితే టీమిండియా టెస్టు క్రికెట్‌ను ఏలడం ఖాయమని పేర్కొన్నాడు. కాగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పటికే టెస్టుల్లో తన మార్కు చూపిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు.. పృథ్వీ షా సైతం వెస్టిండీస్‌తో అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టే ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక అతడు చివరిసారిగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ 18 షో హోమ్ ఆఫ్ హీరోస్‌లో సెహ్వాగ్ మాట్లాడుతూ వీరిద్దరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘పృథ్వీ షా.. టెస్టు క్రికెట్‌లో అసలైన మజా అందించగలడు.
పృథ్వీ షా, రిషభ్ పంత్(ఫైల్ ఫొటోలు)
షా, పంత్ జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్టు కనీసం 400 స్కోరు చేయాల్సి ఉంటుంది. వీళ్లిద్దరూ తుది జట్టులో ఉంటే టీమిండియా టెస్టు క్రికెట్‌ను శాసించగలదు. కచ్చితంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) గెలుస్తుంది కూడా’’ అని ప్రశంసలు కురిపించాడు.
ఇక రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా దించితే అతడు మరింత గొప్పగా రాణించే అవకాశం ఉందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా అండర్-19 వరల్డ్‌కప్ సమయంలో పంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఐపీఎల్‌లోనూ కొన్నాళ్ల పాటు ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంత్ సారథ్యం వహిస్తుండగా... పృథ్వీ షా ఓపెనర్‌గా ఉండటం విశేషం.
చదవండి👉🏾RCB Beat GT: ఆర్సీబీ విజయంతో ఆ 2 జట్లు అవుట్.. ఇక ఢిల్లీ గెలిచిందో అంతే సంగతులు!
చదవండి👉🏾IPL 2022 RR Vs CSK: సీఎస్‌కే తుదిజట్టులో అతడిని చూడాలని ఉంది.. ధోని ఒక్క ఛాన్స్ ఇస్తే!
Comments
Please login to add a commentAdd a comment