భారత క్రికెట్ చరిత్రలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత.. అతడి లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్‌ను టీమిండియా తాయారు చేసుకోలేకపోయింది. భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన జట్టులో వీరేంద్రుడు సభ్యునిగా ఉన్నాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. కొంత మంది టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాను సెహ్వాగ్ తో పోలుస్తుంటారు. పృథ్వీ షా బ్యాటింగ్ సెహ్వాగ్ మాదిరిగానే ఉంటుంది అని అభిప్రాయపడుతుంటారు. ఇక తాజాగా ఇదే విషయంపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బ్యాటర్లలో తనలా ఆడేవాళ్లు ఎవరూ లేరని వీరూ సృష్టం చేశాడు.
"ప్రస్తుత భారత జట్టులో నాలా బ్యాటింగ్ చేసే ఆటగాడు లేడు. అయితే కొంచెం నా బ్యాటింగ్ స్టైల్ మాదిరిగానే పృథ్వీ షా, రిషబ్ పంత్ ఆటతీరు కూడా ఉంటుంది. టెస్టు క్రికెట్ లో రిషభ్ పంత్ బ్యాటింగ్, దూకుడు నా ఆటను పోలి ఉంటుంది.
కానీ అతడు టెస్టుల్లో 90-100 స్కోర్లతోనే సంతృప్తి చెందుతున్నాడు. నేను మాత్రం 200, 250, 300 పైగా పరుగులు సాధించాను. పంత్ నాలాగే భారీ స్కోర్‌లు సాధిస్తే అభిమానులను మరింత అలరించగలడు" అని న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా టెస్ట్ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత ఆటగాడు కూడా వీరేంద్రడే కావడం గమానార్హం.
చదవండి: Major League Cricket: అమెరికా టీ20 లీగ్‌లో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు!
Comments
Please login to add a commentAdd a comment