
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తన ఘోర వైఫల్యాలను కంటిన్యూ చేస్తునే ఉన్నాడు. మ్యాచ్‌లు జరుగుతున్న కొద్ది పృథ్వీ షా ఆటతీరు మరింత దారుణంగా తయారవుతోంది. ఒకప్పుడు మంచి టెక్నిక్‌తో దూకుడుగా ఆడుతూ అందరి మన్ననలు పొందిన పృథ్వీ షా బ్యాటింగ్ ఇంతలా మసకబారడానికి కారణం ఏంటో అంతుచిక్కడం లేదు.
Photo: IPL Twitter
తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో పృథ్వీ మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 13 పరుగులు మాత్రమే చేసిన అతను వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ సీజన్‌లో పృథ్వీ ఆరు మ్యాచ్‌లు కలిపి కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు 15 అంటే ఎంత దారుణంగా ఆడుతున్నాడో ఈ పాటికే అర్థమయి ఉండాలి.
మరి ఇంతలా విఫలమవుతున్నా ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షాకు అవకాశాలు ఎందుకిస్తుందనేది అర్థం కాని ప్రశ్నలా తయారైంది. ఇకనైనా పృథ్వీని పక్కనబెట్టి వేరొకరికి అవకాశం ఇస్తే మంచిదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: #Ishant Sharma: 717 రోజుల తర్వాత ఎంట్రీ.. అదరగొట్టాడు
Comments
Please login to add a commentAdd a comment