Arrested Woman Lawyer Claims Cricketer Was Drunk And Hit Her With A Bat - Sakshi
Sakshi News home page

Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..!

Published Fri, Feb 17 2023 8:22 AM | Last Updated on Fri, Feb 17 2023 9:45 AM

Arrested womans lawyer claims cricketer was drunk and hit her with a bat - Sakshi

Prithvi Shaw selfie controversy: సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని టీమిండియా యువ ఓపెనర్‌ పృథ్వీ షాపై కొంతమంది దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పృథ్వీ షా స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సప్న గిల్‌తో పాటు మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వివాదంలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ​సప్నా గిల్​ తరఫున న్యాయవాది కీలక ఆరోపణలు చేశారు. పృథ్వీ షా మధ్యం మత్తులో బ్యాట్‌తో సప్నా గిల్​పై దాడి చేశాడని ఆరోపించారు.

గిల్ తరపున న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫైవ్ స్టార్ హోటల్‌లో.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ పృథ్వీ షాతో సెల్ఫీ తీసుకోనేందుకు ఓ అభిమానిగా  అతని వద్దకు వెళ్లింది. వారు అప్పటికే ఓ పార్టీలో బీజీబీజీగా ఉన్నారు. ఈ క్రమంలో పృథ్వీ షా మద్యం మత్తులో పక్కనే ఉన్న బ్యాట్‌తో ఆమెను కొట్టాడు.

అయితే తర్వాత రోజు ఆమెపైనే తిరిగి కేసు పెట్టాడు. ఇప్పుడు మేము కూడా అతడిపై కేసు పెడతాము. అతడు మద్యం మత్తులో కారును నడిపాడు. అదే విధంగా అతడు ఒక బైక్ ను కూడా ఢీకొట్టాడు. మేము అతడిపై  354, 509 ,334 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలాని సూచించాం. గతంలో సప్నా గిల్‌కు, పృథ్వీ షాకు ఎటువంటి పరిచయం లేదు. కేవలం సెల్ఫీ దిగడానికి మాత్రమే ఆమె అతడి దగ్గరకు వెళ్లింది. మేము గిల్‌ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు.
చదదవండి: Attack On Prithvi Shaw: టీమిండియా క్రికెటర్‌ పృథ్వీ షాపై దాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement