IPL 2023, PBKS Vs DC: Twitter Goes Berserk As Delhi Capitals Star Prithvi Shaw Slams Half Century - Sakshi
Sakshi News home page

IPL 2023: చాన్నాళ్లకు హాఫ్‌ సెంచరీ.. అంత అయిపోయాక ఆడితే ఏం లాభం!

Published Thu, May 18 2023 8:12 AM | Last Updated on Thu, May 18 2023 9:13 AM

Twitter goes berserk as Delhi Capitals star Prithvi Shaw slams half century - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-203లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝుళిపించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 38 బంతులు ఎదుర్కొన్న పృథ్వీ షా.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 54 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో పృథ్వీ షాకు ఇదే తొలి హాఫ్‌ సెంచరీ కావడం గమానార్హం. 

ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 14.43 సగటుతో కేవలం 101 పరుగులు మాత్రమే చేశాడు. పృథ్వీ షా తన ఆడిన తొలి ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో జట్టు మెనెజ్‌మెంట్‌ అతడిని పక్కన పెట్టింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో అతడు  మరి కనిపించడని అంతా భావించారు.

కానీ అనూహ్యంగా పంజాబ్‌తో మ్యాచ్‌కు జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఢిల్లీ ఓపెనర్‌.. ఛాన్నాళ్ల తర్వాత తన మార్క్‌ను చూపించాడు. అయితే ఇప్పటికే ఈ మెగాటోర్నీ ఫ్లేఆఫ్స్‌ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంత అయిపోయాక ఆడితే ఏమి లాభం అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. కేవలం ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.
చదవండిIPL 2023: పంజాబ్‌ కొంపముంచిన ధావన్‌ చెత్త కెప్టెన్సీ.. అలా చేసి ఉంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement